Telugu Global
National

కాంగ్రెస్‌ పెద్దల వాగ్వాదం, వీడియో వైరల్

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఆ పార్టీ హైకమాండ్ పెద్దల చర్యలకు మరింత పతనమవుతోంది. సొంత రాష్ట్రాల్లో పార్టీని గెలిపించుకోలేని వారంతా కాంగ్రెస్‌ హైకమాండ్ ముసుగులో రాజకీయాలు చేయడం వల్ల పెద్దపెద్ద రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోయింది. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ హైకమాండ్‌ పెద్దలు వాగ్వాదానికి దిగడం, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. హర్యానాలో ఈసారి కాంగ్రెస్‌కు పెద్దగా సీట్లు వచ్చేలా […]

కాంగ్రెస్‌ పెద్దల వాగ్వాదం, వీడియో వైరల్
X

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఆ పార్టీ హైకమాండ్ పెద్దల చర్యలకు మరింత పతనమవుతోంది. సొంత రాష్ట్రాల్లో పార్టీని గెలిపించుకోలేని వారంతా కాంగ్రెస్‌ హైకమాండ్ ముసుగులో రాజకీయాలు చేయడం వల్ల పెద్దపెద్ద రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోయింది.

తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ హైకమాండ్‌ పెద్దలు వాగ్వాదానికి దిగడం, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది.

హర్యానాలో ఈసారి కాంగ్రెస్‌కు పెద్దగా సీట్లు వచ్చేలా లేవని సర్వేలు చెబుతున్న విషయాన్ని ఆ రాష్ట్ర సీనియర్ నేత భూపేంద్ర సింగ్‌ హుడా…. అక్కడే ఉన్న సోనియా కుడి భుజం అహ్మద్ పటేక్‌కు వివరించారు. దాంతో అహ్మద్‌ పటేల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు వస్తాయో అంచనా చెప్పండి అని పటేల్ ప్రశ్నించారు. అందుకు హుడా ”6 నుంచి 12 వరకు” అని సమాధానం ఇచ్చారు. ”అంటే 14 సీట్లు రావొచ్చన్న మాట”అంటూ అహ్మద్ పటేల్ విసిగించుకున్నారు.

”పార్టీ ఎందుకు బలహీనపడింది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోయింది” అంటూ రుసరుసలాడారు. హుడా ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే అహ్మద్ పటేల్ గట్టిగా వాదనకు దిగారు. అక్కడే గులాం నబీ ఆజాద్‌ ఉన్నారు. ఆయన మౌనంగా వీరి మాటలను వింటూ నిల్చున్నారు. వీరి వాగ్వాదాన్ని ఎవరో అక్కడే రహస్యంగా చిత్రీకరించినట్టు ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలకు సరిగ్గా కొద్దిసేపటికి ముందే ఈ వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. బుధవారం రోజు పార్లమెంట్ వద్ద ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

First Published:  3 Oct 2019 9:27 PM GMT
Next Story