Telugu Global
International

పక్షిని అరెస్టు చేసిన పోలీసులు....

మన ఇండియా లోనే కాదు… నెదర్లాండ్ లోనూ పోలీసులకు దిమాక్ ఖరాబ్ అయితే పక్షులను, జంతువులను అరెస్ట్ చేస్తారని నిరూపించే సంఘటన ఇది. షాపులో దొంగతనం చేశాడనే అనుమానం తో ఓ వ్యక్తిని ఫోలీసులు అరెస్ట్ చేసే సమయం లో ఆ వ్యక్తి భుజం పై ఒక పక్షి కూర్చుని ఉన్నదట. నేరంలో దానికీ భాగం ఉన్నదని భావించిన ఆ డచ్ పోలీసులు దానిని కూడా నిందితునితో పాటు జైల్లో ఉంచారు. సెల్‌లో కూర్చున్న పసుపు ఆకుపచ్చ […]

పక్షిని అరెస్టు చేసిన పోలీసులు....
X

మన ఇండియా లోనే కాదు… నెదర్లాండ్ లోనూ పోలీసులకు దిమాక్ ఖరాబ్ అయితే పక్షులను, జంతువులను అరెస్ట్ చేస్తారని నిరూపించే సంఘటన ఇది.

షాపులో దొంగతనం చేశాడనే అనుమానం తో ఓ వ్యక్తిని ఫోలీసులు అరెస్ట్ చేసే సమయం లో ఆ వ్యక్తి భుజం పై ఒక పక్షి కూర్చుని ఉన్నదట. నేరంలో దానికీ భాగం ఉన్నదని భావించిన ఆ డచ్ పోలీసులు దానిని కూడా నిందితునితో పాటు జైల్లో ఉంచారు.

సెల్‌లో కూర్చున్న పసుపు ఆకుపచ్చ పక్షి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పొలిటీ ఉట్రెచ్ట్ సెంట్రమ్… “మేం ఇటీవల షాపులో దొంగతనం చేసిన ఓ నిందితుడిని అరెస్టు చేశాం. అరెస్టు సమయంలో, నిందితుడి భుజంపై ఈకలు, ముక్కుతో కూడిన ఓ పక్షి సాక్షిని మేం చూశాం” అంటూ చమత్కరించారు.

ఇన్ స్టాగ్రాం లో ఉంచిన ఫోటోలో ఆ పక్షికి పోలీసులు రొట్టె ముక్క, నీటిని కూడా అందించినట్లు కనిపిస్తున్నది.

నిర్బంధ సమయంలో, మా దగ్గర పక్షులను ఉంచే ప్రత్యేకమైన గూడు కాని, పంజరం కాని లేకపోవడం తో నిందితుడితో సంప్రదింపులు జరిపిన తరువాత, మేం వారిద్దరిని ఒకే కస్టడీ గదిలో ఉంచాం”అని ఆ పోస్ట్ చెబుతున్నది. పోలీసులు కూడా పక్షిని “బాగా చూసుకుంటున్నారు” అనే ముక్తాయింపూ అందులో ఉన్నది.

ఇంటర్నెట్‌లోని పక్షి ప్రేమికులు పక్షిని వీలైనంత త్వరగా విడిపించాలని డిమాండ్ చేయడంతో ఆ పక్షిని, దాని యజమానిని కొద్దిసేపటికే విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

“పక్షిని ప్రశ్నించలేదు. మాకు తెలిసినంతవరకు దానిపై ఎటువంటి ఆరోపణలకు పాల్పడలేద”ని పోలీసులు మరింత హాస్యాన్ని ఆ పోస్ట్ కి జోడించారు.

First Published:  4 Oct 2019 12:56 AM GMT
Next Story