Telugu Global
International

ట్రంప్ ను భయపెడుతున్న ఎలుకలు

ప్రపంచం లో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఎవరు అంటె ఠక్కున అమెరికా ప్రెసిడెంట్ అని సమాధానం వస్తుంది. అతడు నివసించే వైట్ హౌస్ కి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో వేరే చెప్పవలసిన పని లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ తలచుకుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రాంతమయినా క్షణాల్లో బూడిద అవుతుంది. కానీ అంతటి శక్తివంతుడైన అధ్యక్షులవారు తాను నివసించే వైట్ హౌస్ లో ఎలుకలను ఏమీ చెయ్యలేకపోతున్నారట. ఎలుకలే కాదు, చీమలు, బొద్దింకలు లాంటి […]

ట్రంప్ ను భయపెడుతున్న ఎలుకలు
X

ప్రపంచం లో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఎవరు అంటె ఠక్కున అమెరికా ప్రెసిడెంట్ అని సమాధానం వస్తుంది. అతడు నివసించే వైట్ హౌస్ కి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో వేరే చెప్పవలసిన పని లేదు.

అమెరికన్ ప్రెసిడెంట్ తలచుకుంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రాంతమయినా క్షణాల్లో బూడిద అవుతుంది. కానీ అంతటి శక్తివంతుడైన అధ్యక్షులవారు తాను నివసించే వైట్ హౌస్ లో ఎలుకలను ఏమీ చెయ్యలేకపోతున్నారట.

ఎలుకలే కాదు, చీమలు, బొద్దింకలు లాంటి వాటిని కూడా ఆయన ఏమీ చెయ్యలేక కోపాన్ని దిగమింగుకుంటున్నారట. అక్టోబర్ 1వ తారీఖున వైట్ హౌస్ లో విలేకర్ల న్యూస్ బ్రీఫ్ కార్యక్రమం జరుగుతున్నది. ఉన్నట్టుండి ఉదయం 10:45 సమయం లో ఎన్బిసి న్యూస్ వైట్ హౌస్ కరస్పాండెంట్ పీటర్ అలెగ్జాండర్ ఒడిలో సీలింగ్ నుంచి ఒక ఎలుక పడింది. అతడు బిత్తరపోయి పైకి లేచాడు.

అసలు సంగతిని పక్కన పెట్టి విలేకర్లందరూ ఎలుక పారిపోయిన వైపుకు పరుగులు తీశారు. అప్పటి కప్పుడు అప్ డేట్స్ ఇస్తూ… సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టారు. చివరికి అసలు కథానాయకి ఎలుక అక్కడ, ఇక్కడా నక్కుతూ మీటింగ్ హాల్ నుంచి జర జరా పారిపోయింది.

“అసలు అన్ని సెక్యురిటీ తనిఖీలు పూర్తి చేసుకునే ఈ రౌడీ ఎలుక లోపలికి ప్రవేశించిందా” వంటి అనేక హాస్యొక్తులతో విలేకర్లు సొషల్ మీడియాని ముంచేత్తారు.

ఎలుకలు, బొద్దింకలు వంటివి ‘1600 పెన్సిల్వేనియా అవెన్యూ’కి కొత్తేమీ కావు. అమెరికా సర్వ సైన్యాధ్యక్షునికి ఇవి ఎప్పటి నుంచో తలనొప్పిగానే ఉన్నాయి.

23 వ అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ భార్య కరోలిన్ హారిసన్ ఒకసారి… “ఎలుకలు దాదాపుగా భవనాన్ని ఆక్రమించేశాయి. అందువల్ల వాటిని తరిమికొట్టడానికి ఫెర్రెట్ ఉన్న వ్యక్తి నియామకం అవసరం. అవి చాలా ఉన్నాయి. ఎంతో ధైర్యంగా టేబుల్ మీద లేచి కూర్చుంటాయి”అంటూ వాపోయింది.

1889-1893 మధ్య బెంజమిన్ హారిసన్ అధ్యక్షునిగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 45వ వారు. ఆయన కూదా ఎలుకలతో విసిగిపోయి 2017 లో వైట్ హౌస్ “నిజమైన డంప్” అన్నారట.

ఇదండీ ట్రంప్ వీరత్వం, సూరత్వం. ఇంట్లో ఎలుకల గోల… కానీ బయట ప్రపంచాన్ని మాత్రం బెదిరింపుల తో భయపేడతారు.

First Published:  3 Oct 2019 6:41 AM GMT
Next Story