Telugu Global
Cinema & Entertainment

సుజీత్ కి ప్రభాస్ మరో అవకాశం ఇచ్చాడా? 

సాహో అనే భారీ బడ్జెట్ సినిమా ని బాహుబలి అయిపోగానే ప్రారంభించిన ప్రభాస్, కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన సుజీత్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఒక యువ దర్శకుడిని నమ్మి అంత భారీ ప్రాజెక్ట్ ని ప్రభాస్ స్టార్ట్ చేయడం ఇండస్ట్రీ లో బాగా చర్చనీయాంశం అయింది. అయితే సినిమా విడుదల అనంతరం మాత్రం అనేక మంది సుజీత్ తనకి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు అని విమర్శలు గుప్పించారు. సుజీత్ కి ఇక […]

సుజీత్ కి ప్రభాస్ మరో అవకాశం ఇచ్చాడా? 
X

సాహో అనే భారీ బడ్జెట్ సినిమా ని బాహుబలి అయిపోగానే ప్రారంభించిన ప్రభాస్, కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన సుజీత్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఒక యువ దర్శకుడిని నమ్మి అంత భారీ ప్రాజెక్ట్ ని ప్రభాస్ స్టార్ట్ చేయడం ఇండస్ట్రీ లో బాగా చర్చనీయాంశం అయింది.

అయితే సినిమా విడుదల అనంతరం మాత్రం అనేక మంది సుజీత్ తనకి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు అని విమర్శలు గుప్పించారు. సుజీత్ కి ఇక అవకాశాలు కష్టమే అనే రేంజ్ లో విమర్శలు చేశారు…. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ మళ్ళీ సుజీత్ కి ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాడట.

సినిమా రిజల్ట్ కన్నా సాహో షూటింగ్ సమయంలో…. ప్రభాస్ కి సుజీత్ మీద ఉన్న నమ్మకమే ఇప్పుడు ఇంకో అవకాశం ఇచ్చేలా చేసిందని తెలుస్తోంది. జాన్ అనే సినిమా ని ప్రస్తుతం చేస్తున్న ప్రభాస్, ఆ సినిమా పూర్తి కాగానే మరలా సుజీత్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట.

ఈ లోపు సుజీత్ కథ కి సంబందించిన పనుల్లో ఉంటాడట. ఎలాగైనా ఈ సారి ప్రభాస్ కి హిట్ ఇచ్చి అందరి నమ్మకాన్ని తిరిగి పొందాలనేది సుజీత్ ముందున్న లక్ష్యం.

First Published:  1 Oct 2019 10:25 PM GMT
Next Story