Telugu Global
NEWS

నవయుగకు షాక్

మచిలీపట్నం పోర్టు ఒప్పందం విషయంలో నవయుగ సంస్థకు హైకోర్టులో చుక్కెదురైంది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని ఇటీవల ప్రభుత్వం రద్దు చేయగా… దాన్ని సవాల్ చేస్తూ నవయుగ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఒప్పందం రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మరొకరికి ప్రాజెక్టు అప్పగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నవయుగ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. టెండర్ల పక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే టెండర్లను మాత్రం తాము చెప్పే వరకు ఓపెన్ చేయవద్దని సూచించింది. 2008లో పోర్టు […]

నవయుగకు షాక్
X

మచిలీపట్నం పోర్టు ఒప్పందం విషయంలో నవయుగ సంస్థకు హైకోర్టులో చుక్కెదురైంది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని ఇటీవల ప్రభుత్వం రద్దు చేయగా… దాన్ని సవాల్ చేస్తూ నవయుగ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఒప్పందం రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

మరొకరికి ప్రాజెక్టు అప్పగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నవయుగ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. టెండర్ల పక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే టెండర్లను మాత్రం తాము చెప్పే వరకు ఓపెన్ చేయవద్దని సూచించింది.

2008లో పోర్టు నిర్మాణం కోసం ఒప్పందం జరిగింది. ఆ సమయంలో భూములను కూడా నవయుగ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పని చేయలేదు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేస్తే నెల్లూరు జిల్లాలోని తమ పోర్టు ఆదాయం పడిపోతుందన్న ఉద్దేశంతో… కావాలనే నవయుగ సంస్థ మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టలేదని ప్రభుత్వం భావించింది. దాంతోనే ఇటీవల ఒప్పందం రద్దు చేసింది.

First Published:  1 Oct 2019 9:53 PM GMT
Next Story