Telugu Global
NEWS

నేటి నుంచే ఏపీలో గ్రామ స్వరాజ్యం

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ స్థాయిలోనే పనులు జరిగేలా గ్రామ సచివాలయాలకు నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉండేలా ఇటీవలే లక్షా 34వేల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించారు. దాంతో పాటు […]

నేటి నుంచే ఏపీలో గ్రామ స్వరాజ్యం
X

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ స్థాయిలోనే పనులు జరిగేలా గ్రామ సచివాలయాలకు నేడు శ్రీకారం చుట్టబోతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉండేలా ఇటీవలే లక్షా 34వేల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించారు. దాంతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు.

గ్రామ సచివాలయాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు చిన్నచిన్న పనుల కోసం ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 72 గంటల్లోనే 500కు పైగా సేవలను గ్రామ సచివాలయాల్లోనే పొందవచ్చు. దాదాపు 34 శాఖలకు చెందిన సేవలను గ్రామ సచివాలయంలో అందుకోవచ్చు. పించన్, ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్ కార్డు తదితర సేవలు 72 గంటల్లోనే అందిస్తారు.

లబ్దిదారుల ఎంపికలో గోప్యతకు అవకాశమే లేదు. ప్రతి గ్రామంలోనూ లబ్దిదారుల పేర్లను గ్రామ సచివాలయం వద్ద నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు. దీని వల్ల సోషల్ అడిట్‌ కూడా చేసినట్టు అవుతుంది. అనర్హులు ఎవరైనా ఉన్నా కనిపెట్టే అవకాశం ఉంటుంది.

First Published:  1 Oct 2019 9:30 PM GMT
Next Story