Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (01-10-2019)

అశ్వద్ధామ తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీకి సంబంధించి ఆమధ్య వైజాగ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఆ షూటింగ్ లోనే శౌర్య గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు… కానీ, ఆగిపోయిన వైజాగ్ షెడ్యూల్ ను మాత్రం కొనసాగించలేదు. ఎట్టకేలకు అప్పట్లో ఆగిపోయిన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తిచేశాడు. కట్ లేకుండా 3 నిమిషాల నిడివి ఉండే యాక్షన్ సీన్స్ గా […]

స్టుడియో రౌండప్ (01-10-2019)
X

అశ్వద్ధామ

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీకి సంబంధించి ఆమధ్య వైజాగ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఆ షూటింగ్ లోనే శౌర్య గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు… కానీ, ఆగిపోయిన వైజాగ్ షెడ్యూల్ ను మాత్రం కొనసాగించలేదు. ఎట్టకేలకు అప్పట్లో ఆగిపోయిన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తిచేశాడు.

కట్ లేకుండా 3 నిమిషాల నిడివి ఉండే యాక్షన్ సీన్స్ గా ఇవి సినిమాలో కనిపిస్తాయట. ఇక ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

సరిలేరు నీకెవ్వరు

రెండు కీలకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఓవైపు రామోజీ ఫిలింసిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ లో షూట్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ భవంతి సెట్ లో షూట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టుల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత.. తమన్నతో కలిసి ఐటెంసాంగ్ షూట్ లో పాల్గొంటాడు మహేష్.

రొమాంటిక్

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి గోవాలో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. నిన్నట్నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. అనీల్ పాదూరి డైరక్ట్ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ పై పూరి, చార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వి

సుధీర్ బాబు, నాని కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాకు సంబంధించి తాజాగా థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తిచేశారు. 12 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో ఓ ఫైట్, ఓ సాంగ్ పూర్తిచేశారు. రేపట్నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఎంత మంచివాడవురా

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ రెండో షెడ్యుల్ పూర్తి చేసుకుంది. రాజమండ్రిలో దాదాపు నెల రోజులు జరిగిన షెడ్యుల్ లో ఒక ఐటెం సాంగ్ ను అలాగే కొన్ని సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేసారు.

అక్టోబర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో మూడో షెడ్యూల్ జరగనుంది. ఆ త‌ర్వాత నాలుగ‌వ షెడ్యూల్లో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో ప్లాన్ చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. క్రాంతి మాధవ్ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రాశిఖన్నా మధ్య సన్నివేశాలు తీస్తున్నారు. ఈనెల రెండో వారం నుంచి యూరోప్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కేవలం పాటల కోసం వెళ్లడం లేదు, కథ ప్రకారం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా ఇది.

First Published:  1 Oct 2019 7:00 AM GMT
Next Story