Telugu Global
NEWS

ఒత్తిడితో మరో ఇంగ్లీష్ క్రికెటర్ చిత్తు

అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన సారా టేలర్  13 ఏళ్లపాటు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ గా సారా అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని క్రికెటర్లు ఎవరంటే…బ్రిటీష్ క్రికెటర్లు అనిమాత్రమే చెప్పాలి. పురుషులు, మహిళలు అన్న తేడాలేకుండా.. విపరీతమైన ఆతృత, అత్యుత్తమంగా రాణించాలన్న తపన, భరించలేని ఒత్తిడికి గురికావడం, వైఫల్యాన్ని, ఓటమిని ఏమాత్రం భరించలేకపోడం..ఇంగ్లండ్ క్రికెటర్లకు దశాబ్దాల తరబడి ఓ ప్రధాన బలహీనతగా, మానసిక వైకల్యంగా ఉంటూ వస్తోంది. గత 13 సంవత్సరాలుగా ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కు […]

ఒత్తిడితో మరో ఇంగ్లీష్ క్రికెటర్ చిత్తు
X
  • అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన సారా టేలర్
  • 13 ఏళ్లపాటు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ గా సారా

అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని క్రికెటర్లు ఎవరంటే…బ్రిటీష్ క్రికెటర్లు అనిమాత్రమే చెప్పాలి.

పురుషులు, మహిళలు అన్న తేడాలేకుండా.. విపరీతమైన ఆతృత, అత్యుత్తమంగా రాణించాలన్న తపన, భరించలేని ఒత్తిడికి గురికావడం, వైఫల్యాన్ని, ఓటమిని ఏమాత్రం భరించలేకపోడం..ఇంగ్లండ్ క్రికెటర్లకు దశాబ్దాల తరబడి ఓ ప్రధాన బలహీనతగా, మానసిక వైకల్యంగా ఉంటూ వస్తోంది.

గత 13 సంవత్సరాలుగా ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కు వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ గా అసమాన సేవలు అందిస్తూ వచ్చిన 30 ఏళ్ల సారా టేలర్.. అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు… ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

17 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఇంగ్లండ్ జట్టులో సభ్యురాలిగా ఉంటూ వచ్చిన సారా గత 13 సంవత్సరాల కాలంలో ఆడిన 226 మ్యాచ్ ల్లో 6 వేల 533 పరుగులు సాధించింది. ప్రపంచకప్ నెగ్గిన జట్టులో కీలకసభ్యురాలిగా సైతం గుర్తింపు తెచ్చుకొంది.

అయితే…ఒత్తిడిని భరించే శక్తి లేకపోడం, ఏదో తెలియని గందరగోళంతో సతమతం కావడం వంటి కారణాలతో క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఆరోగ్యమే ప్రధానం- సారా

గత 13 సంవత్సరాలుగా తన జీవితంలో ఓ ప్రధానభాగంగా ఉంటూ వచ్చిన క్రికెట్ కంటే తనకు ఆరోగ్యమే ముఖ్యమని సారా ప్రకటించింది.

తీవ్ర ఒత్తిడి కారణంగా తన ఆరోగ్యం రానురాను క్షీణించిపోడంతో రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని..ఇంగ్లండ్ జెర్సీ ధరించి గ్రౌండ్ లో దిగిన ప్రతిసారీ తాను అత్యుత్తమంగా రాణించడానికి కృషి చేశానని గుర్తు చేసుకొంది.

ఇంగ్లండ్ జట్టులో సభ్యురాలు కావటం తనకు గర్వకారణమని సారా తన ప్రకటనలో పేర్కొంది.

First Published:  28 Sep 2019 12:22 AM GMT
Next Story