Telugu Global
NEWS

ప్రభుత్వ సలహాదారుగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి

సీనియర్ జర్నలిస్ట్‌, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. పబ్లిక్ పాలసీ విభాగంలో ప్రభుత్వానికి సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రామచంద్రమూర్తి నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రత్యేకంగా వెల్లడిస్తామని జీవోలో వివరించారు. రామచంద్రమూర్తిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా స్వస్థలం. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ పదవి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వైదొలిగిన తర్వాత రామచంద్రమూర్తి ఆ స్థానంలోకి వచ్చారు. ఇటీవల జగన్‌ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఒక […]

ప్రభుత్వ సలహాదారుగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి
X

సీనియర్ జర్నలిస్ట్‌, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. పబ్లిక్ పాలసీ విభాగంలో ప్రభుత్వానికి సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

రామచంద్రమూర్తి నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రత్యేకంగా వెల్లడిస్తామని జీవోలో వివరించారు.

రామచంద్రమూర్తిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా స్వస్థలం. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ పదవి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వైదొలిగిన తర్వాత రామచంద్రమూర్తి ఆ స్థానంలోకి వచ్చారు.

ఇటీవల జగన్‌ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా రామచంద్రమూర్తి రూపొందించారు.

First Published:  27 Sep 2019 8:30 PM GMT
Next Story