Telugu Global
Cinema & Entertainment

రీమేక్ సినిమా నుంచి తప్పుకున్న వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాగా ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మరియు టబు హీరోహీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ […]

రీమేక్ సినిమా నుంచి తప్పుకున్న వెంకటేష్
X

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.

వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాగా ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అయితే తాజాగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మరియు టబు హీరోహీరోయిన్లుగా నటించి సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. సురేష్ బాబు స్వయంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడు.

50 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తన కంటే వయసులో చాలా చిన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తే బాగుంటుందని సురేష్ బాబు అనుకున్నాడట. కానీ వెంకీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా తనకు సెట్ అవ్వదని నిర్ణయించుకున్న వెంకటేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. మరి సురేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాని ఏ హీరోతో చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు వెంకటేష్ ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశాడు. ఈ సినిమా గురించి గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

First Published:  27 Sep 2019 3:54 AM GMT
Next Story