Telugu Global
International

ట్రంప్‌పై అభిశంసన.... మొదలైనట్టు స్పీకర్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీసుకొచ్చారు డెమొక్రాట్‌ పార్టీ నేతలు. డెమొక్రాట్లతో చర్చల తర్వాత ట్రంప్‌పై అభిశంసన పక్రియ మొదలైనట్టు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని… అధ్యక్షుడైనా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పీకర్‌ నాన్సీ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ మాత్రం తనను వెంటాడి వేధిస్తున్నారని… అందులో భాగంగానే అభిశంసన తెస్తున్నారని ఆరోపించారు. 2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు డెమొక్రాట్ పార్టీ నాయకుడు జోయ్ బైడన్‌కు మధ్య […]

ట్రంప్‌పై అభిశంసన.... మొదలైనట్టు స్పీకర్ ప్రకటన
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీసుకొచ్చారు డెమొక్రాట్‌ పార్టీ నేతలు. డెమొక్రాట్లతో చర్చల తర్వాత ట్రంప్‌పై అభిశంసన పక్రియ మొదలైనట్టు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు.

చట్టానికి ఎవరూ అతీతులు కారని… అధ్యక్షుడైనా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పీకర్‌ నాన్సీ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ మాత్రం తనను వెంటాడి వేధిస్తున్నారని… అందులో భాగంగానే అభిశంసన తెస్తున్నారని ఆరోపించారు.

2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు డెమొక్రాట్ పార్టీ నాయకుడు జోయ్ బైడన్‌కు మధ్య గట్టి పోటీ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడన్‌ను దెబ్బతీసేందుకు ట్రంప్… ఉక్రెయిన్ సాయం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.

బైడన్‌ కుమారుడు ఉక్రెయిన్‌లో వ్యాపారాలు చేస్తుంటారు. అక్కడ బైడన్ కుమారుడి వ్యాపారాల్లో లోపాలను వెలికి తీయాలని… వాటిపై విచారణ జరిపించాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.

ఉక్రెయిన్‌ను దువ్వేందుకే ట్రంప్‌ ఆ దేశానికి ఆర్థిక సాయం ప్రకటించినట్టు విమర్శలు వస్తున్నాయి. బైడన్ కుమారుడిని అవినీతి కేసుల్లో ఇరికించేలా ఒత్తిడి తెస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ స్వయంగా టెలిఫోన్‌లో మాట్లాడిన అంశాన్ని కూడా అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్‌ … ఇలా అక్రమ మార్గంలో ఇతర దేశాలతో చేతులు కలపడం క్షమించరాని నేరమని అందుకే ఆయనపై అభిశంసన పెట్టామని డెమొక్రాట్లు చెబుతున్నారు.

First Published:  25 Sep 2019 7:43 PM GMT
Next Story