Telugu Global
Cinema & Entertainment

షాకింగ్.. సైరాలో పాటలు రెండంటే రెండే

సైరా సినిమాకు సంబంధించి షాకింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో కేవలం రెండే పాటలు ఉంటాయని స్పష్టంచేశాడు. నిజంగా ఇది మెగాభిమానులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే చిరంజీవి పాపులర్ అయిందే పాటలు, డాన్స్ లతో. అలాంటిది సైరాలో కేవలం రెండే పాటలంటే అది ఫ్యాన్స్ కు మింగుడుపడని వార్తే. కానీ ఇదే నిజం. సైరా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సురేందర్ రెడ్డి.. సినిమాలో ఫుల్ లెంగ్త్ పాటలు రెండే […]

షాకింగ్.. సైరాలో పాటలు రెండంటే రెండే
X

సైరా సినిమాకు సంబంధించి షాకింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో కేవలం రెండే పాటలు ఉంటాయని స్పష్టంచేశాడు. నిజంగా ఇది మెగాభిమానులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే చిరంజీవి పాపులర్ అయిందే పాటలు, డాన్స్ లతో. అలాంటిది సైరాలో కేవలం రెండే పాటలంటే అది ఫ్యాన్స్ కు మింగుడుపడని వార్తే. కానీ ఇదే నిజం.

సైరా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సురేందర్ రెడ్డి.. సినిమాలో ఫుల్ లెంగ్త్ పాటలు రెండే ఉంటాయని స్పష్టంచేశాడు. మరో 2 పాటలు ఉన్నప్పటికీ అవి బ్యాక్ గ్రౌండ్ లో మాంటేజ్ సాంగ్స్ గా వస్తాయని తెలిపాడు. అయితే త్వరలోనే విడుదల చేయబోతున్న జూక్ బాక్స్ (ఆడియో సాంగ్స్)లో మాత్రం 8 పాటలుంటాయని అంటున్నాడు. కేవలం జూక్ బాక్స్ కోసమే అదనంగా మరో 4 పాటలు పెట్టామని, అవి సినిమాలో ఉండవని క్లారిటీ ఇచ్చేశాడు.

సైరా సినిమా అనేది చరిత్రకు సంబంధించిన మూవీ. స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవిత గాధను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంతో రీసెర్చ్ చేశారు. ఎన్నో సీన్స్ రాసుకున్నారు. అవన్నీ సినిమాలో పెట్టాలంటే పాటలు తగ్గించాల్సిందే. మేకర్స్ ఇప్పుడు అదే పనిచేశారు. ఇలా చేయడం వల్లనే సినిమా 164 నిమిషాలతో ఆగిందని, పాటలు కూడా పెడితే 3 గంటలు రన్ టైమ్ దాటిపోయేదని చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి

First Published:  25 Sep 2019 9:10 PM GMT
Next Story