Telugu Global
Cinema & Entertainment

ఆపిల్ బ్యూటీ లైలా మళ్లీ వస్తోంది

ఆపిల్ బ్యూటీ.. ప్రస్తుతం ఈ ఉపమానాన్ని హీరోయిన్ హన్సికకు వాడుతున్నాం. కానీ ఈమె కంటే ముందే ఆపిల్ బ్యూటీ అనిపించుకున్న హీరోయిన్ లైలా. చూడ్డానికి చిన్న పిల్లలా, అమయాకంగా కనిపించే లైలా ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. ఇప్పుడీ బ్యూటీ మరోసారి తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. హీరోయిన్ గా అలరించిన లైలా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో కీలక పాత్ర […]

ఆపిల్ బ్యూటీ లైలా మళ్లీ వస్తోంది
X

ఆపిల్ బ్యూటీ.. ప్రస్తుతం ఈ ఉపమానాన్ని హీరోయిన్ హన్సికకు వాడుతున్నాం. కానీ ఈమె కంటే ముందే ఆపిల్ బ్యూటీ అనిపించుకున్న హీరోయిన్ లైలా. చూడ్డానికి చిన్న పిల్లలా, అమయాకంగా కనిపించే లైలా ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. ఇప్పుడీ బ్యూటీ మరోసారి తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. హీరోయిన్ గా అలరించిన లైలా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారబోతోంది.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఓ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో కీలక పాత్ర పోషించబోతోంది లైలా. ఈ విషయాన్ని స్వయంగా తనే వెల్లడించింది. అలీతో సరదాగా అనే కార్యక్రమంలో లైలా ఈ మేటర్ బయటపెట్టింది. ఇప్పటికే పలు యాడ్స్ తో రీఎంట్రీ ఇచ్చిన లైలా, ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సమాయత్తమౌతోంది. తెలుగులో ఆమె ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం లాంటి హిట్ సినిమాల్లో నటించింది.

అటు తమిళ్ లో కూడా లైలాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కల్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న పితామగన్ సినిమాలో లైలా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో సూర్య లవర్ గా లైలా యాక్టింగ్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అలా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న లైలా.. 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది.

First Published:  26 Sep 2019 12:49 AM GMT
Next Story