Telugu Global
NEWS

నేనైతే కరకట్ట ఇంట్లో అస్సలు ఉండేవాడిని కాదు...

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి… తన మాజీ బాస్‌పై తొలిసారిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా బాబు భజన చేస్తున్న సుజనా… తొలిసారి బాబు విధానాలను చీ కొట్టారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కరకట్ట ఇంటిని పట్టుకుని వేలాడడాన్ని తప్పుపట్టారు. తక్షణం చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. తాను అయితే అక్రమంగా నిర్మించిన కరకట్ట ఇంటిలో అస్సలు ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసలు ఆ […]

నేనైతే కరకట్ట ఇంట్లో అస్సలు ఉండేవాడిని కాదు...
X

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి… తన మాజీ బాస్‌పై తొలిసారిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత కూడా బాబు భజన చేస్తున్న సుజనా… తొలిసారి బాబు విధానాలను చీ కొట్టారు.

చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కరకట్ట ఇంటిని పట్టుకుని వేలాడడాన్ని తప్పుపట్టారు. తక్షణం చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

తాను అయితే అక్రమంగా నిర్మించిన కరకట్ట ఇంటిలో అస్సలు ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసలు ఆ ఇంట్లో ఇప్పటికీ ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

ప్రభుత్వం అక్రమ ఇంటిని కూల్చివేస్తే సానుభూతి పొందాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని సుజనాచౌదరి విమర్శించారు.

First Published:  25 Sep 2019 6:13 AM GMT
Next Story