Telugu Global
Cinema & Entertainment

సైరా కోసం ప్రభాస్ ప్రమోషన్

సైరా ప్రచారం కోసం అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని యూనిట్ వదులుకోవడం లేదు. మరీ ముఖ్యంగా నిర్మాత రామ్ చరణ్ తన నెట్ వర్క్ మొత్తాన్ని బయటకు తీస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ సైతం సైరా ట్రయిలర్ పై స్పందించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు. అవును.. సైరా కోసం ప్రభాస్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. సైరా ప్రచారంలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ ను కలిపి ఇంటర్వ్యూ చేయబోతున్నాడు ప్రభాస్. తన […]

సైరా కోసం ప్రభాస్ ప్రమోషన్
X

సైరా ప్రచారం కోసం అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని యూనిట్ వదులుకోవడం లేదు. మరీ ముఖ్యంగా నిర్మాత రామ్ చరణ్ తన నెట్ వర్క్ మొత్తాన్ని బయటకు తీస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్స్ సైతం సైరా ట్రయిలర్ పై స్పందించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు. అవును.. సైరా కోసం ప్రభాస్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

సైరా ప్రచారంలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ ను కలిపి ఇంటర్వ్యూ చేయబోతున్నాడు ప్రభాస్. తన ఫ్రెండ్ రామ్ చరణ్ కోరిక మేరకు ఇలా యాంకర్ అవతారం ఎత్తేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడు. అయితే కాస్త మొహమాటపడుతూ, బిడియంగా ఉండే ప్రభాస్.. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ను ఎలా ఇంటర్వ్యూ చేస్తాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం దీనిపైనే యూనిట్ సీరియస్ గా చర్చిస్తోంది.

మార్కెట్లో ఎంతోమంది హీరోలున్నారు. చరణ్, చిరు అడిగితే ఎవరూ నో చెప్పరు. కానీ సైరా కోసం ప్రత్యేకంగా ప్రభాస్ ను రంగంలోకి దించడానికి ఓ కారణం ఉంది. బాహుబలి-2లో పాన్-ఇండియా స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన సాహో సినిమాతో బాలీవుడ్ లో ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చింది. సైరా లాంటి సినిమా బాలీవుడ్ జనాలకు కనెక్ట్ అవ్వాలంటే ప్రభాస్ రంగంలోకి దిగాల్సిందే. ఇప్పుడదే జరుగుతోంది. రేపోమాపో ప్రభాస్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేయబోతున్నాడు.

First Published:  24 Sep 2019 7:02 PM GMT
Next Story