Telugu Global
Cinema & Entertainment

కొరియన్ రీమేక్ లో నయనతార

సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘గృహం’ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మిళింద్ రావు ఇప్పుడు నయనతార హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నెట్రీకన్’అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా సౌత్ కొరియా లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. ‘బ్లైండ్’ అనే టైటిల్ తో సౌత్ కొరియాలో సూపర్ హిట్ అయిన ఈ […]

కొరియన్ రీమేక్ లో నయనతార
X

సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘గృహం’ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మిళింద్ రావు ఇప్పుడు నయనతార హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

‘నెట్రీకన్’అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా సౌత్ కొరియా లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. ‘బ్లైండ్’ అనే టైటిల్ తో సౌత్ కొరియాలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా…. ఇప్పటికే చైనీస్ మరియు జపనీస్ భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు మిళింద్.

ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ చూస్తే నయనతార ఈ సినిమాలో ఒక గుడ్డి అమ్మాయి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ‘గృహం’ సినిమాతో హిట్ అందుకున్న మిళింద్ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తాడాని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు మరియు నయన్ బాయ్ ఫ్రెండ్ అయినా విగ్నేష్ శివన్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గిరీష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

First Published:  25 Sep 2019 5:25 AM GMT
Next Story