Telugu Global
Cinema & Entertainment

కామెడీ వెబ్ సిరీస్ లో పోసాని....

ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు, నవదీప్, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ వంటి నటీనటులు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మరి కొందరు నటులు చేరబోతున్నారు. తెలుగులో ‘భజన బ్యాచ్’ అనే ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తాలూకా అధికారిక ప్రకటన నిన్ననే వచ్చింది. కామెడీ ఎంటర్ […]

కామెడీ వెబ్ సిరీస్ లో పోసాని....
X

ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు, నవదీప్, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ వంటి నటీనటులు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

తాజాగా ఈ జాబితాలో మరి కొందరు నటులు చేరబోతున్నారు. తెలుగులో ‘భజన బ్యాచ్’ అనే ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తాలూకా అధికారిక ప్రకటన నిన్ననే వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో పోసాని కృష్ణ మురళి, గెటప్ శీను, జెమిని సురేష్, అజయ్ ఘోష్ మరియు రాఘవ…. ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ దర్శకుడు మారుతి కాన్సెప్ట్ ను అందించారు. బీ చిన్నికృష్ణ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ ఛానల్ ఐడ్రీమ్ స్వయంగా ఈ సిరీస్ ని నిర్మిస్తోంది. ‘భజన బ్యాచ్’ సోనీ లైవ్ లో త్వరలో విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో కూడా ‘యప్ టివి’ వెబ్ సైట్ లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. సోనీ ఎంటర్ టైన్ మెంట్ డిజిటల్ ప్లాట్ ఫారం అయిన సోనీ లైవ్ లో రాబోతున్న మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ కావడంతో దీని పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఇందులో నటిస్తున్న నటీనటులు ప్రేక్షకులకి తెలిసిన వారే కావడంతో ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  25 Sep 2019 6:08 AM GMT
Next Story