Telugu Global
Cinema & Entertainment

సైరా సెన్సార్ టాక్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ దక్కింది. సినిమాను ఆసాంతం చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ చెప్పలేదు. సినిమా డ్యూరేషన్ 164 నిమిషాలుంది. సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా టాక్ బయటకు వచ్చింది. సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సైరా సినిమా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుందట. దేశభక్తిని రగిల్చడం కంటే హీరోయిజం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సెకెండాఫ్ మొత్తం చిరంజీవి చుట్టూనే […]

సైరా సెన్సార్ టాక్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ దక్కింది. సినిమాను ఆసాంతం చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ చెప్పలేదు. సినిమా డ్యూరేషన్ 164 నిమిషాలుంది. సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా టాక్ బయటకు వచ్చింది.

సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సైరా సినిమా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుందట. దేశభక్తిని రగిల్చడం కంటే హీరోయిజం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సెకెండాఫ్ మొత్తం చిరంజీవి చుట్టూనే తిరుగుతుందట. పైగా సెకెండాఫ్ లో గ్రాఫిక్స్ కూడా బాహుబలి-2 కంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్నారు. సెన్సార్ టాక్ తో సైరా సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

నిజానికి ఈ సినిమా సెన్సార్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులకు పైగా టైమ్ ఉంది. ఇంత ముందుగా సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ అవుతుండడంతో.. ఆఖరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే ఇలా అన్ని భాషల్లో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేస్తున్నారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది సైరా.

First Published:  23 Sep 2019 7:02 PM GMT
Next Story