Telugu Global
Cinema & Entertainment

గద్దలకొండ గణేష్ పై చిరు ప్రశంసలు

గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా చిరంజీవిని రంగంలోకి దించారు మేకర్స్. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడంతో, అదే ఊపును కొనసాగించాలంటే చిరును దించాల్సిందేనని యూనిట్ డిసైడ్ అయింది. అందుకే వరుణ్ తేజ్ ప్రత్యేకంగా తన పెదనాన్నను రిక్వెస్ట్ చేయడం, చిరంజీవి ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో గద్దలకొండ గణేష్ చిత్రాన్ని చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాను యూనిట్ తో కలిసి చూసిన మెగాస్టార్, […]

గద్దలకొండ గణేష్ పై చిరు ప్రశంసలు
X

గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా చిరంజీవిని రంగంలోకి దించారు మేకర్స్. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ రావడంతో, అదే ఊపును కొనసాగించాలంటే చిరును దించాల్సిందేనని యూనిట్ డిసైడ్ అయింది. అందుకే వరుణ్ తేజ్ ప్రత్యేకంగా తన పెదనాన్నను రిక్వెస్ట్ చేయడం, చిరంజీవి ఓకే అనడం చకచకా జరిగిపోయాయి.

ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో గద్దలకొండ గణేష్ చిత్రాన్ని చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాను యూనిట్ తో కలిసి చూసిన మెగాస్టార్, ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఓవైపు సైరా సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నప్పటికీ, మరోవైపు వరుణ్ తేజ్ సినిమా కోసం చిరంజీవి ఇలా టైమ్ కేటాయించడం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమా చూసిన చిరంజీవి వరుణ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేస్తూ, మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచించారు. సినిమాను డైరక్ట్ చేసిన దర్శకుడు హరీష్ తో పాటు నిర్మించిన నిర్మాతల్ని ప్రత్యేకంగా అభినందించాడు. చిరంజీవి రాకతో గద్దలకొండ గణేష్ యూనిట్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. అదే ఉత్సాహంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో సుడిగాలి పర్యటనలు చేయబోతోంది యూనిట్.

First Published:  24 Sep 2019 8:49 AM GMT
Next Story