Telugu Global
Cinema & Entertainment

విరాట పర్వం.... మళ్ళీ మొదలు

రానా దగ్గుబాటి హీరో గా, నీది నాది ఒకే కథ అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన వేణు ఉడుగుల ఒక కొత్త సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించనప్పటికీ మీడియా లో ఈ సినిమా కి విరాట పర్వం అనే టైటిల్ ఖరారయింది అనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ సినిమా ప్రకటించిన వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టింది సినిమా యూనిట్. […]

విరాట పర్వం.... మళ్ళీ మొదలు
X

రానా దగ్గుబాటి హీరో గా, నీది నాది ఒకే కథ అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన వేణు ఉడుగుల ఒక కొత్త సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించనప్పటికీ మీడియా లో ఈ సినిమా కి విరాట పర్వం అనే టైటిల్ ఖరారయింది అనే ప్రచారం సాగుతుంది.

అయితే ఈ సినిమా ప్రకటించిన వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టింది సినిమా యూనిట్. సాయి పల్లవి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల మీద కొన్ని ముఖ్యమైన సీన్ లని తీశాడు దర్శకుడు.

అయితే ఆ తర్వాత రానా అందుబాటులో లేకవడం తో షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

రానా తిరిగి హైదరాబాద్ రావడం తో వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు.

సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

First Published:  22 Sep 2019 11:10 PM GMT
Next Story