Telugu Global
Cinema & Entertainment

మెగాహీరో మళ్లీ డేటింగ్?

తను ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో హీరోయిన్ తో చాలా క్లోజ్ అయిపోతుంటాడు మెగా హీరో సాయి తేజ్. అది అతడి నైజం. పుకారురాయుళ్లకు అదే బలం. ఇతడిపై ఎప్పటికప్పుడు డేటింగ్ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న హీరోయిన్ రెజీనాతో కుచ్ కుచ్ హోతా హై అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిపై చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు సాయితేజ్. ఆమధ్య తేజూ-రకుల్ జంటపై కూడా గాసిప్స్ వచ్చాయి. వాటిని కూడా సాయితేజ్ ఖండించాడు. ఇప్పుడీ హీరోపై […]

మెగాహీరో మళ్లీ డేటింగ్?
X

తను ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో హీరోయిన్ తో చాలా క్లోజ్ అయిపోతుంటాడు మెగా హీరో సాయి తేజ్. అది అతడి నైజం. పుకారురాయుళ్లకు అదే బలం. ఇతడిపై ఎప్పటికప్పుడు డేటింగ్ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న హీరోయిన్ రెజీనాతో కుచ్ కుచ్ హోతా హై అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిపై చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు సాయితేజ్. ఆమధ్య తేజూ-రకుల్ జంటపై కూడా గాసిప్స్ వచ్చాయి. వాటిని కూడా సాయితేజ్ ఖండించాడు. ఇప్పుడీ హీరోపై మరోసారి డేటింగ్ పుకార్లు ఊపందుకున్నాయి.

ప్రతి రోజూ పండగే అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఇందులో రాశిఖన్నాతో కలిసి నటిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య ప్రేమ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటికి కారణం తాజాగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు. అత్యంత సన్నిహితంగా ఉన్న స్టిల్స్ తో పుకార్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు రావడానికి మరో కారణం కూడా ఉంది.

ఇంతకుముందు సాయితేజ్, రాశిఖన్నా కలిసి ఓ సినిమా చేశారు. వీళ్లిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. కాబట్టి ఈసారి మరింత క్లోజ్ అయ్యారనేది పుకార్ల సారాంశం. ఈ రూమర్లతో సంబంధం లేకుండా సాయితేజ్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎందుకంటే, ఇలాంటి డేటింగ్ రూమర్స్ ఈ మెగా హీరోకు కొత్త కాదు కదా.

First Published:  23 Sep 2019 12:16 PM GMT
Next Story