Telugu Global
Cinema & Entertainment

సైరాలో పవన్ పాత్ర ఇదే

సైరా టీజర్ లో పవన్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అది టీజర్ కే పరిమితమా లేక సినిమాలో కూడా ఉంటుందా అనే అంశంపై ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లోనే స్పందించాడు రామ్ చరణ్. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని స్పష్టంచేశాడు. ఇప్పుడీ అంశంపై చిరంజీవి మరింత స్పష్టత ఇచ్చారు. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి.. సినిమాలో పవన్ వాయిస్ ఎక్కడెక్కడ వస్తుందో విడమర్చి మరీ చెప్పారు “సైరా సినిమా ప్రారంభంలో పవన్ […]

సైరాలో పవన్ పాత్ర ఇదే
X

సైరా టీజర్ లో పవన్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అది టీజర్ కే పరిమితమా లేక సినిమాలో కూడా ఉంటుందా అనే అంశంపై ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లోనే స్పందించాడు రామ్ చరణ్. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని స్పష్టంచేశాడు. ఇప్పుడీ అంశంపై చిరంజీవి మరింత స్పష్టత ఇచ్చారు. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి.. సినిమాలో పవన్ వాయిస్ ఎక్కడెక్కడ వస్తుందో విడమర్చి మరీ చెప్పారు

“సైరా సినిమా ప్రారంభంలో పవన్ వాయిస్ వినిపిస్తుంది. పాత్రను పరిచయం చేయడంతో పాటు అప్పటి పరిస్థితుల్ని పవన్ తన గొంతుతో అద్భుతంగా పలికించాడు. ఇక సినిమా చివర్లో కూడా పవన్ కల్యాణ్ వాయిస్ వినిపిస్తుంది. పవన్ మైండ్ సెట్ కు, అతడి భావాలకు దగ్గరగా ఇందులో లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ చూసిన వెంటనే పవన్ తప్ప మరో వ్యక్తి నా మనసులోకి రాలేదు. వెంటనే పవన్ కు ఫోన్ చేయడం, తను ఒప్పుకోవడం జరిగింది. సినిమాలో పవన్ వాయిస్ వింటే ఎవరికైనా ఓ కొత్త రకమైన శక్తి వస్తుంది.”

సైరా సినిమా చేయడానికి స్ఫూర్తి బాహుబలి అని ప్రకటించారు చిరంజీవి. బాహుబలి సినిమా పాన్-ఇండియా లెవెల్లో హిట్ అవ్వడంతో సైరా ప్రాజెక్టు చేయాలనే ఉత్సాహం తమకు వచ్చిందని, అలా పుష్కరకాలంగా చర్చల దశలోనే ఉండిపోయిన ఈ సినిమా బాహుబలి ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు వెండితెరపైకి వస్తోందని స్పష్టంచేశారు.

First Published:  23 Sep 2019 12:02 PM GMT
Next Story