Telugu Global
International

అమిత్ షా ఆల్ ఇన్ ఒన్ కార్డు ఐడియా

పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతాలు వంటి అన్ని యుటిలిటీలతో పౌరులకు మల్టీపర్పస్ ఐడెంటిటీ కార్డ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రతిపాదించారు. ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి వాటి స్థానం లో ఒకే కార్డును ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మరింత వేగంగా, సునాయాసం గా తెలుసుకోవడానికి సింగిల్ విండో లాగ ఈ కార్డ్ ను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్న మాట. […]

అమిత్ షా ఆల్ ఇన్ ఒన్ కార్డు ఐడియా
X

పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతాలు వంటి అన్ని యుటిలిటీలతో పౌరులకు మల్టీపర్పస్ ఐడెంటిటీ కార్డ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రతిపాదించారు.

ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి వాటి స్థానం లో ఒకే కార్డును ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మరింత వేగంగా, సునాయాసం గా తెలుసుకోవడానికి సింగిల్ విండో లాగ ఈ కార్డ్ ను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్న మాట.

“ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి అన్ని యుటిలిటీల కోసం మన దగ్గర కేవలం ఒక కార్డు మాత్రమే ఉండవచ్చు. ఇది శక్తివంతమైనది” అని షా అన్నారు

ఇప్పుటి కే ఆధార్ లో పొందుపరచిన సమాచారం లీక్ అవుతుందనే భయంతో ఉన్న జనానికి అమిత్ షా ప్రతిపాదిస్తున్న ఈ అల్ ఇన్ ఒన్ కార్డ్ మరింత భయకంపితులను చేయక మానదు.

అలాగే మొబైల్ యాప్ ద్వారా 2021 జనాభా లెక్కల డేటాను సేకరిస్తామని అమిత్ షా తెలిపారు.

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, జనాభా డేటాకి సమాచారం ఆటోమాటిక్ గా చేరే వ్యవస్థ కూడా ఉండాలని ఆయన అన్నారు.

First Published:  23 Sep 2019 5:43 AM GMT
Next Story