Telugu Global
National

70-80 లకు చేరిన కిలో ఉల్లి ధర

ఉల్లిపాయ వ్యాపారులపై స్టాక్ పరిమితుల విధింపు, ఎగుమతులను నిరుత్సాహ పరచడం వంటి చర్యలతో కేంద్రం విరుచుకుపడుతోంది. అయినా వంట గదిలో అతి ప్రధానమైన ఉల్లి రిటైల్ ధరలు దేశ రాజధానిలోనే కాక, ఇతర ప్రాంతాలలో కూడా కిలోకు రూ.70-80 వరకు పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రిటైల్ ఉల్లి ధరలు ఢిల్లీలో కిలో రూ.57, ముంబైలో 56 రూపాయలు, కోల్‌కతాలో రూ.48, చెన్నైలో రూ.34 లకు పెరిగింది. ఇదే కాలంలో […]

70-80 లకు చేరిన కిలో ఉల్లి ధర
X

ఉల్లిపాయ వ్యాపారులపై స్టాక్ పరిమితుల విధింపు, ఎగుమతులను నిరుత్సాహ పరచడం వంటి చర్యలతో కేంద్రం విరుచుకుపడుతోంది.

అయినా వంట గదిలో అతి ప్రధానమైన ఉల్లి రిటైల్ ధరలు దేశ రాజధానిలోనే కాక, ఇతర ప్రాంతాలలో కూడా కిలోకు రూ.70-80 వరకు పెరిగాయి.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రిటైల్ ఉల్లి ధరలు ఢిల్లీలో కిలో రూ.57, ముంబైలో 56 రూపాయలు, కోల్‌కతాలో రూ.48, చెన్నైలో రూ.34 లకు పెరిగింది. ఇదే కాలంలో గుర్గాం, జమ్మూలలో కిలోకు 60 రూపాయల ధర ఉంది.

అయితే, ట్రేడ్ డేటా ప్రకారం రిటైల్ ఉల్లి ధర గత వారం చివరిలో కిలోకు 70-80 రూపాయలకు పెరిగింది.

సరఫరాను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఉల్లి ధర పెరుగుతోంది. దేశీయ సరఫరాను మెరుగుపరచడానికి, ఉల్లిపాయల ధరల పెరుగుదలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం గత కొన్ని వారాలలో అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ, అధిక వర్షాల కారణంగా సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అందువల్ల గత 2-3 రోజులలో రిటైల్ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.

రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి మామూలు స్థితికి రాకపోతే ఉల్లి వ్యాపారులపై నిల్వ పరిమితులను విధించే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.

ఉల్లిగడ్డలను ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్య ప్రదేశ్ లలో గత కొద్ది రోజులలో అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం నిల్వ చేసిన ఉల్లిపాయలను దేశంలోని చాలా ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు, తాజా ఖరీఫ్ (వేసవి) పంట నవంబర్ నుండి మార్కెట్లోకి వస్తుందని వ్యాపారులు తెలిపారు.

దేశంలో గత సంవత్సరం పంటలో నిల్వ చేసిన ఉల్లిపాయలు తగినంతగా సరఫరా అవుతున్నాయని, అయితే భారీ వర్షాల కారణంగా దాని రవాణా దెబ్బతిందని వ్యాపారులు తెలిపారు.

ఉల్లిపాయల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నిల్వ ఉంది. ఇక్కడ వర్షాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా అంతరాయం కలిగించాయని ఆసియాలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గాం టోకు వ్యాపారులు చెప్పారు.

లాసల్గాం హోల్‌సేల్ మార్కెట్లో, ఉల్లి ధర గత వారం కిలోకు రూ.45 కి పెరిగింది, అంతకుముందు ఏడాది కాలంలో ఇది కిలోకు రూ.10 కన్నా తక్కువ.

ధిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. తన బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయను నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ వంటి ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తోంది. ఇవి కిలోకు 22 రూపాయలకు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మదర్ డెయిరీ దేశ రాజధానిలో కిలోకు రూ.23 ఉల్లిని అమ్ముతున్నది.

సెంట్రల్ బఫర్ స్టాక్‌ను ఎత్తివేస్తూ తమ రాష్ట్రాల్లో సరఫరాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఢిల్లీ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సూచనను పాటిస్తున్నాయి.

కేంద్రంలో 56,000 టన్నుల ఉల్లిపాయ నిల్వ ఉంది. అందులో ఇప్పటివరకు 16,000 టన్నులు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఢిల్లీలో రోజుకు 200 టన్నులను అందుబాటులో ఉంచుతున్నారు.

అంతేకాకుండా, కనీస ఎగుమతి ధరను పెంచడం, ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవడం ద్వారా ఉల్లి ఎగుమతిని కేంద్రం నిరుత్సాహపరిచింది. బ్లాక్‌మార్కెటీర్లపై కూడా విరుచుకుపడుతోంది.

అధిక వర్షాల కారణంగా ఉల్లిపాయ నాటిన విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ ఉత్పత్తి తగ్గవచ్చనే అంచనా… ఉల్లి ధరలను ఒత్తిడికి గురిచేస్తున్నదని అంటున్నారు.

First Published:  23 Sep 2019 2:19 AM GMT
Next Story