Telugu Global
International

మోడీ భారత ప్రధాని అని మరిచిపోతున్నాడు

ఆదివారం అమెరికాలో జరిగిన ‘హౌడీ, మోడీ’ ఈవెంట్… ఇద్దరూ తమ ప్రసంగాలలో ఒకరినొకరు ప్రశంసించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎంతోకాలంగా అనుసరిస్తూ వస్తున్న భారత విదేశాంగ విధానాన్ని మోడీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఘాటుగా విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి డొనాల్డ్ ట్రంప్‌కు అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్న కొద్ది గంటలలోనే కాంగ్రెస్… మరొక దేశం ఎన్నికలలో జోక్యం చేసుకోకూడదనే భారత విదేశాంగ విధానాన్ని మోదీ ఉల్లంఘించారని […]

మోడీ భారత ప్రధాని అని మరిచిపోతున్నాడు
X

ఆదివారం అమెరికాలో జరిగిన ‘హౌడీ, మోడీ’ ఈవెంట్… ఇద్దరూ తమ ప్రసంగాలలో ఒకరినొకరు ప్రశంసించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఎంతోకాలంగా అనుసరిస్తూ వస్తున్న భారత విదేశాంగ విధానాన్ని మోడీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఘాటుగా విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి డొనాల్డ్ ట్రంప్‌కు అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్న కొద్ది గంటలలోనే కాంగ్రెస్… మరొక దేశం ఎన్నికలలో జోక్యం చేసుకోకూడదనే భారత విదేశాంగ విధానాన్ని మోదీ ఉల్లంఘించారని ఆరోపించింది.

‘హౌడీ, మోడీ’ కార్యక్రమంలో టెక్సాస్‌లోని భారత ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోడి ట్రంప్‌ను ప్రశంసించారు. ట్రంప్ “నాయకత్వ పటిమ, అమెరికా పట్ల ఉన్న పాషన్, ప్రతి అమెరికన్‌ పట్ల ఉన్న బాధ్యతాయుత భావం, అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడానికి తీసుకున్న సంకల్పం” కారణాలుగా చూపుతూ… “అబ్కి బార్ ట్రంప్ సర్కార్,” అని మోదీ తన సొంత ఎన్నికల నినాదాన్ని ప్రస్తావించారు.

వరుస ట్వీట్లలో, కాంగ్రెస్ సీనియర్ ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ, మోడీ భారతదేశ ప్రధానిగా అమెరికాలో ఉన్నారని, యుఎస్ ఎన్నికలలో స్టార్ కాంపయినర్ గా కాదని అన్నారు. “మిస్టర్ ప్రైం మినిష్టర్, మీరు ఎంతో గౌరవానికి పాత్రమైన భారత విదేశాంగ విధానమైన మరొక దేశం అంతరంగిక ఎన్నికలలో జోక్యం చేసుకోకూడదనే నియమాన్ని ఉల్లంఘించారు. భారతదేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకు ఇది ఒక విఘాతం” అని ఆదివారం రాత్రి టెక్సాస్‌లో హౌడీ మోడీ కార్యక్రమం తర్వాత శర్మ ట్విట్టర్‌లో విమర్శించారు. .

First Published:  23 Sep 2019 5:38 AM GMT
Next Story