Telugu Global
Cinema & Entertainment

మరోసారి ఫెయిల్ అయిన సూర్య

కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు సూర్య. అతడు నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి బందోబస్త్ సినిమా కూడా చేరిపోయింది. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీ, నైజాంలో వచ్చిన ఈ వసూళ్లను అస్సలు పట్టించుకోనవసరం లేదంటే, కలెక్షన్లు ఏ స్థాయిలో వచ్చాయో అర్థంచేసుకోవచ్చు. సూర్య నుంచి తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. అతడి నుంచి కమర్షియల్ సినిమాలు […]

మరోసారి ఫెయిల్ అయిన సూర్య
X

కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాడు సూర్య. అతడు నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి బందోబస్త్ సినిమా కూడా చేరిపోయింది. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీ, నైజాంలో వచ్చిన ఈ వసూళ్లను అస్సలు పట్టించుకోనవసరం లేదంటే, కలెక్షన్లు ఏ స్థాయిలో వచ్చాయో అర్థంచేసుకోవచ్చు.

సూర్య నుంచి తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారు. అతడి నుంచి కమర్షియల్ సినిమాలు కాకుండా.. కొత్త కథలు, కొత్త గెటప్స్ కోరుకుంటున్నారు. అటు తమిళ ప్రజలు మాత్రం సూర్య పక్కా కమర్షియల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఈ రెండు అంశాల్ని ఒకే సినిమాలో అందించడం సూర్య వల్లకావడం లేదు. అందుకే బందోబస్త్ సినిమా తమిళనాట కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది.

నిజానికి సూర్యకు టాలీవుడ్ లో మంచి టైమింగ్ దొరికింది. సాహో రన్ పూర్తయింది. గ్యాంగ్ లీడర్ కూడా సోసోగా నడుస్తోంది. థియేటర్లలో మంచి గ్యాప్ ఉంది.

మరోవైపు గద్దలకొండ గణేష్ మినహా మరో సినిమా పోటీలో లేదు. ఈ అవకాశాన్ని సూర్య క్యాష్ చేసుకోలేకపోయాడు. పేలవమైన స్క్రిప్ట్, సన్నివేశాలతో తెరకెక్కిన బందోబస్త్ సినిమా ఏమాత్రం ఆకట్టుకోకపోగా.. భారీ రన్ టైమ్ ప్రేక్షకుల్ని సహనాన్ని పరీక్షించింది.

First Published:  21 Sep 2019 12:53 AM GMT
Next Story