Telugu Global
Cinema & Entertainment

‘గద్దలకొండ గణేష్’ సినిమా రివ్యూ

రివ్యూ : గద్దలకొండ గణేష్ రేటింగ్ : 2.75/5 తారాగణం : వరుణ్ తేజ్, అథర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజీ, ప్రభాస్ సీను తదితరులు సంగీతం : మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం : జిబ్రాన్‌ నిర్మాత : రామ్ ఆచంట, గోపి ఆచంట దర్శకత్వం :  హరీష్ శంకర్ ఈమధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో […]

‘గద్దలకొండ గణేష్’ సినిమా రివ్యూ
X

రివ్యూ : గద్దలకొండ గణేష్
రేటింగ్ : 2.75/5
తారాగణం : వరుణ్ తేజ్, అథర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజీ, ప్రభాస్ సీను తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్
నేపథ్య సంగీతం :
జిబ్రాన్‌
నిర్మాత : రామ్ ఆచంట, గోపి ఆచంట

దర్శకత్వం : హరీష్ శంకర్

ఈమధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్పటిదాకా లవర్ బాయ్ తరహా పాత్రలు చేసిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషించగా, పూజా హెగ్డే , మృణాలినీ రవి హీరోయిన్ లుగా నటించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే భారీ అంచనాలను పెంచేశారు దర్శకనిర్మాతలు. ఈసినిమా ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చేసింది.

అభి (అధర్వ మురళి) ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. తాను రాసుకున్న కథతో బోలెడు మంది నిర్మాతలను కూడా కలుస్తాడు. ఈ నేపథ్యంలో ఒక నిర్మాత అభి తో సినిమా తీస్తానని చెబుతాడు… కానీ ఆ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ సినిమా అయి ఉండాలని షరతు పెడతాడు.

దీంతో గ్యాంగ్ స్టర్ మీద కథ రాయడానికి నిజ జీవితంలోనే గ్యాంగ్ స్టర్ అయిన గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) మీద రీసెర్చ్ మొదలుపెడతాడు. గద్దల కొండ గణేష్ ఒక కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్. అతని మీద కథ రాయడానికి అభి ఎవరి సహాయం తీసుకుంటాడు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.

ఇప్పటిదాకా కనిపించనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కొన్ని కొన్ని చోట్ల నెగటివ్ షేడ్స్ వరుణ్ కి అంతగా సెట్ అవ్వకపోయినా ఒక నటుడిగా తన ప్రతిభను చాటే సినిమా ఇది.

అథర్వ మురళి కూడా చాలా బాగా నటించాడు. వరుణ్ తేజ్ కి ధీటుగా తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. పూజ హెగ్డే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

అయితే పూజ హెగ్డే పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమవ్వడం కొంత నిరాశ పరుస్తుంది. మృణాళిని రవి కూడా పూజ తో పోటీ పడుతూ తన వంతు నటనతో మంచి మార్కులు వేయించుకుంది.

బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను కామెడీ సినిమాలో చాలా బాగా పండింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు చాలా బాగా నటించారు.

రీమేక్ సినిమా అయినప్పటికీ ప్రతి సన్నివేశాన్ని ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించకుండా కథను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. అన్ని పాత్రలను హరీష్ శంకర్ చాలా చక్కగా డిజైన్ చేశాడు.

కథ నెరేషన్ పరంగా కూడా హరీష్ శంకర్ పర్వాలేదు అనిపించుకున్నాడు.. కానీ ఫస్ట్ హాఫ్ ని హ్యాండిల్ చేసినంత బాగా సెకండ్ హాఫ్ ని చేయలేదని చెప్పాలి.

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట అందించిన నిర్మాణ విలువలు సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇప్పటికే రెండు మూడు పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ వంటి పాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

పాటలు మాత్రమే కాదు మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఆయానంక బోస్ అందించిన విజువల్స్ చూడచక్కగా ఉన్నాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

వరుణ్ తేజ్ నటన,
నేపధ్య సంగీతం,
కథ నెరేషన్

బలహీనతలు:

కొన్ని సాగతీత సన్నివేశాలు,
కామెడీ అనుకున్నంత రేంజ్ లో లేకపోవడం

సినిమాలో వరుణ్ తేజ్ నటన అన్నింటికంటే పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హరీష్ టేకింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ ని చూపించిన విధంగా సెకండ్ హాఫ్ తీర్చిదిద్దడంలో దర్శకుడు హరీష్ శంకర్ విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.

సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. సినిమా లెంగ్త్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలని తీసేసి ఉంటే సినిమా ఇంకొంచెం బాగుండేదని అనిపిస్తుంది.

ఫ్లాష్ బ్యాగ్ లో వరుణ్ తేజ్ మరియు పూజ హెగ్డే ప్రేమ కథని చాలా బాగా తెరకెక్కించారు. వారి మధుర సన్నివేశాలు చాలా బాగుంటాయి. అప్పటిదాకా కథని చాలా కొత్తగా చూపించినప్పటికి క్లైమాక్స్ లో రొటీన్ గా మార్చేయడం కొంత నిరాశకు గురిచేస్తుంది. చివరగా ‘గద్దలకొండ గణేష్’ సినిమా ఒక మాస్ మసాలా మూవీ.

బాటమ్ లైన్: వరుణ్ తేజ్ లోని నటుడిని పూర్తి స్థాయిలో బయటకి తెచ్చిన ‘గద్దలకొండ గణేష్’

First Published:  20 Sep 2019 6:48 AM GMT
Next Story