Telugu Global
NEWS

మొహాలీ వేదికగా నేడే రెండో టీ-20

సఫారీలపై హాట్ ఫేవరెట్ గా భారత్  రిషభ్ పంత్ పై పెరుగుతున్న ఒత్తిడి భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియానికి చేరింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడంతో…ఈ మ్యాచ్ సిరీస్ కే కీలకంగా మారింది. బ్యాట్స్ మన్ స్వర్గధామం మొహాలీ స్టేడియం వికెట్ పై 170కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఈ సిరీస్ ను […]

మొహాలీ వేదికగా నేడే రెండో టీ-20
X
  • సఫారీలపై హాట్ ఫేవరెట్ గా భారత్
  • రిషభ్ పంత్ పై పెరుగుతున్న ఒత్తిడి

భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియానికి చేరింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడంతో…ఈ మ్యాచ్ సిరీస్ కే కీలకంగా మారింది.

బ్యాట్స్ మన్ స్వర్గధామం మొహాలీ స్టేడియం వికెట్ పై 170కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఈ సిరీస్ ను ఉపయోగించుకోవాలన్న వ్యూహంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించింది.

యువ స్పిన్నర్లు దీపక్ చహార్, వాషింగ్టన్ సుందర్ లతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ల సత్తాకు ఈ మ్యాచ్ పరీక్షకానుంది.

రోహిత్ జోడీగా శిఖర్ ధావన్…

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా శిఖర్ ధావన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్థిక్ పాండ్యా, జడేజా, కృణాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్, దీపక్ చహార్, నవదీప్ సైనీ తుదిజట్టులో సభ్యులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

మరోవైపు… వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డి కాక్ నాయకత్వంలోని సఫారీజట్టులో డ్యూసెన్, టెంబా బువామా, జూనియర్ డాలా, జోర్న్ ఫోర్ట్యూన్, హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, నోర్జే, పెహ్లు కాయా,కిర్గిసో రబాడా, ప్రిటోరియస్, షంషీ, జార్జిలతో కూడిన మెరికల్లాంటి ఆటగాళ్లున్నారు.

చేజింగ్ జట్లకే విజయావకాశం…

మొహాలీ వేదికగా గత సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో సగటున 171కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. పైగా…చేజింగ్ కు దిగిన జట్లే అత్యధికసార్లు విజేతగా నిలవడం విశేషం.

ఏది ఏమైనా…ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టుకే సిరీస్ పై పట్టుబిగించే అవకాశం ఉంటుంది. హాట్ ఫేవరెట్ గా భారత్ తన సత్తా చాటుకొంటుందా…లేక సఫారీటీమ్.. ఝలక్ ఇస్తుందా ? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  17 Sep 2019 8:30 PM GMT
Next Story