Telugu Global
NEWS

వర్ల రామయ్య ఆడియో, వీడియోలు చూడు బాబు

ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేయాలన్న ఉద్దేశంతోనే కోడెల మరణంపై చంద్రబాబు పదేపదే ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. బతికున్నంత కాలం హింసించడం, చనిపోయిన తర్వాత శవాల పక్కన నిలబడి రాజకీయం చేయడం అన్నది చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనన్నారు. కోడెల మీద అంత ప్రేమ ఉంటే మూడు నెలలుగా ఒక్కసారైనా కోడెలను చంద్రబాబు పరామర్శించారా అని నిలదీశారు. పైగా కోడెలకు వ్యతిరేకంగా టీడీపీలోనే మరో వర్గాన్ని చంద్రబాబు […]

వర్ల రామయ్య ఆడియో, వీడియోలు చూడు బాబు
X

ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేయాలన్న ఉద్దేశంతోనే కోడెల మరణంపై చంద్రబాబు పదేపదే ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. బతికున్నంత కాలం హింసించడం, చనిపోయిన తర్వాత శవాల పక్కన నిలబడి రాజకీయం చేయడం అన్నది చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనన్నారు.

కోడెల మీద అంత ప్రేమ ఉంటే మూడు నెలలుగా ఒక్కసారైనా కోడెలను చంద్రబాబు పరామర్శించారా అని నిలదీశారు. పైగా కోడెలకు వ్యతిరేకంగా టీడీపీలోనే మరో వర్గాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తూ వస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పది రోజుల క్రితం కూడా కోడెల ఆస్పత్రిలో చేరితే చంద్రబాబు ఎందుకు పరామర్శకు వెళ్లలేదో చెప్పాలన్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ ను ఎలా తీసుకెళ్తారని వర్ల రామయ్య ఇటీవల ప్రశ్నించడాన్ని గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. కోడెల చర్యల వల్ల పార్టీ ఇమేజ్‌కు, అధ్యక్షుడికి ఇబ్బందులు వస్తున్నాయంటూ వర్గ రామయ్య వ్యాఖ్యానించిన వీడియోను మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి ప్రదర్శించారు. తప్పు దొరికింది కాబట్టి దొంగతనం కేసు పెట్టకుండా ప్రభుత్వం ఎలా ఉంటుందని వర్లరామయ్యే వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.

కోడెల కుటుంబంపై ప్రభుత్వం, వైసీపీ కేసులు పెట్టలేదని… సామాన్యులే కేసులు పెట్టారని చెప్పారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తొలుత వైర్‌తో కోడెల ఉరికేసుకున్నారని చెప్పిందని.. ఆ తర్వాత ఇంజెక్షన్ వికటించి చనిపోయాడని ఒకసారి, గుండెపోటు వల్ల చనిపోయాడని మరోసారి… ఇలా రకరకాలుగా ప్రచారం చేసి చివరకు ప్రభుత్వంపై బురదజల్లేందుకు వేధింపుల వల్లే చనిపోయాడంటూ చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టాడని విమర్శించారు.

1983కు ముందు ఏపీలో ఎలాంటి గొడవలు లేవన్నారు. ఆ తర్వాతే ఏపీలోని రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో కక్షలు, ఫ్యాక్షన్ పెరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో ఎంతో మంది నేతలను హత్య చేశారన్నారు. అనంతపురం జిల్లాలో వందల మంది ప్రత్యర్థులను టీడీపీ హత్య చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

చివరకు వైసీపీ నేతలను ఎంఆర్‌వో కార్యాలయానికి పిలిపించి అక్కడే నరికి చంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. పత్తికొండ వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేసిన టీడీపీ నేతలకు ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.

కొడుకు, కూతురు చేసిన పనుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వర్ల రామయ్యే టీడీపీ కార్యకర్తతో ఫోన్లో చెప్పిన ఆడియో టేపును కూడా శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించారు.

చలో ఆత్మకూరు కార్యక్రమానికి తాను కూడా వస్తానని కోడెల శివప్రసాదరావు కోరితే… వద్దు… నీవు రావొద్దు అని చంద్రబాబు చెప్పారా లేదా అని నిలదీశారు. నరసరావుపేట టికెట్ కూడా ఇవ్వకుండా … ఇప్పుడు మాత్రం పల్నాటి సింహం, పల్నాటి పులి అంటూ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.

ఆత్మీయుల మరణాన్ని కూడా రాజకీయం కోసం వాడుకునే రోబోతత్వం చంద్రబాబుది అన్నారు. కోడెల చనిపోతే చంద్రబాబు కళ్లలో నీరు రాకపోయినా ఆయన కళ్లలో నీరు వస్తున్నాయని చూపించడానికి ఎల్లో మీడియా పడుతున్న తపన ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

కోడెల కుటుంబంపై కేసులుపెట్టిన బాధితులను బెదిరించేలా చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. స్వయంగా చంద్రబాబే విచ్చలవిడిగా అవినీతి చేయడంతో ఆయన్ను చూసుకుని… కింది స్థాయి కార్యకర్తల వరకు దోచుకునేందుకు అలవాటు పడ్డారన్నారు.

First Published:  17 Sep 2019 2:38 AM GMT
Next Story