Telugu Global
NEWS

యురేనియం తవ్వం... ఓ పార్టీ అధ్యక్షుడైతే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు

“ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పర్యావరణ ప్రేమికుడు…. నల్లమలలో యురేనియం ఉందో లేదో తెలుసుకోవడానికే ఏఎండీ అధికారులు పరీక్షలు చేస్తున్నారు తప్ప తవ్వకాల కోసం కాదు” అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కే.తారక రామారావు అన్నారు. నిజానికి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, తాము పరీక్షలకు అనుమతి మాత్రమే ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు యురేనియంపై ప్రశ్నల వర్షం కురిపించారు. యురేనియం […]

యురేనియం తవ్వం... ఓ పార్టీ అధ్యక్షుడైతే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు
X

“ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పర్యావరణ ప్రేమికుడు…. నల్లమలలో యురేనియం ఉందో లేదో తెలుసుకోవడానికే ఏఎండీ అధికారులు పరీక్షలు చేస్తున్నారు తప్ప తవ్వకాల కోసం కాదు” అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కే.తారక రామారావు అన్నారు.

నిజానికి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, తాము పరీక్షలకు అనుమతి మాత్రమే ఇచ్చామని మంత్రి తెలిపారు.

ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు యురేనియంపై ప్రశ్నల వర్షం కురిపించారు. యురేనియం తవ్వకాలపై కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఓ పార్టీ అధ్యక్షుడైతే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు.

“యురేనియం తవ్వకాలకు ఎవరు అనుమతి ఇచ్చారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ప్రతికలు, మీడియా కూడా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయి. పత్రికల్లో రాసినట్లుగా ఎక్కడా జరగదు” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సినీరంగానికి చెందిన వ్యక్తులు ముందుకు వచ్చారు. తవ్వకాలకు వ్యతిరేకంగా సంతాకాల సేకరణ కూడా చేపట్టారు. రెండు రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు మేథావులు, ప్రజా సంఘాలకు చెందిన వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాడు మంత్రి తారక రామారావు ముఖ్యమంత్రితో మాట్లాడతానని ప్రకటించారు కూడా.

ఈ నేపథ్యంలో ఈరోజు శాసనమండలిలో కేటీఆర్ చేసిన ప్రకటన ప్రాముఖ్యత సంతరించుకుంది.

First Published:  15 Sep 2019 1:55 AM GMT
Next Story