Telugu Global
Cinema & Entertainment

ట్రైలర్ టాక్: బందోబస్త్

సూర్య, ఆర్య, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బందోబస్త్. ఈ సినిమా ని కె వీ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ సినిమా కి సంబందించిన వార్తలు వస్తున్నా… మొత్తానికి ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో జరిపి, ఈ సినిమా కి సంబందించిన ట్రయిలర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ట్రయిలర్ విషయానికి వస్తే… ఇందులో ఎన్నో […]

ట్రైలర్ టాక్: బందోబస్త్
X

సూర్య, ఆర్య, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బందోబస్త్. ఈ సినిమా ని కె వీ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ సినిమా కి సంబందించిన వార్తలు వస్తున్నా… మొత్తానికి ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో జరిపి, ఈ సినిమా కి సంబందించిన ట్రయిలర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా ట్రయిలర్ విషయానికి వస్తే… ఇందులో ఎన్నో కథలు ఉన్నట్టు గా అనిపిస్తుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ గా సూర్య కనిపించనున్నాడు. మోహన్ లాల్ ఒక మంత్రి గా కనిపించనున్నాడు. ఆర్య కూడా ఒక కీలక పాత్ర లో కనిపిస్తున్నాడు.

ఈ ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్ తో పాటు ఇంటెన్స్ పోరాట సన్నివేశాలు కూడా ఉండటం విశేషం. ఇకపోతే ఈ సినిమా లో అవినీతి, దేశ ద్రోహం, దేశ రక్షణ, టెర్రరిజం కి సంబందించిన అంశాలు ఉండేలా కనిపిస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లో సయేశా కూడా నటిస్తుంది. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 20 న విడుదల కానుంది.

First Published:  14 Sep 2019 12:35 AM GMT
Next Story