Telugu Global
National

74 ఏళ్ల వృద్ధుడికి ఒంటి కొమ్ము....

Man grows devil's horn: మన జానపద కథల్లో ఒంటి కన్ను లేదా ఒంటి కొమ్ము రాక్షసుల గురించి విన్నాం. నిజ జీవితంలో అటువంటి వారు ఎప్పుడూ మనకు తటస్థ పడలేదు కదూ… అయితే మధ్య ప్రదేశ్ లో ఓ 74 ఏళ్ల వృద్ధుడికి ఉన్న ఒంటి కొమ్మును డాక్టర్లు తొలగించారు.

74 ఏళ్ల వృద్ధుడికి ఒంటి కొమ్ము....
X

మన జానపద కథల్లో ఒంటి కన్ను లేదా ఒంటి కొమ్ము రాక్షసుల గురించి విన్నాం. నిజ జీవితంలో అటువంటి వారు ఎప్పుడూ మనకు తటస్థ పడలేదు కదూ… అయితే మధ్య ప్రదేశ్ లో ఓ 74 ఏళ్ల వృద్ధుడికి ఉన్న ఒంటి కొమ్మును డాక్టర్లు తొలగించారు.

ఈ వార్త చూసిన వారెవరికైనా మనుషులకు కొమ్ములెట్లా మొలుస్తాయి అనే అనుమానం రావచ్చు. శ్యాం లాల్ యాదవ్ అనే ఈ వృద్ధుడి ఉదంతం తెలుసుకుంటే అది ఎలా సాధ్యమో అర్థమౌవుతుంది.

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రాహ్లి గ్రామం లో నివసించే శ్యాం లాల్ యాదవ్ కి పుట్టుకతోనే ఈ కొమ్ము లేదు. చాలా ఏళ్ల క్రితం తలకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి తలపై ఒక గుబ్బ లాంటిది పైకి పెరగడం ప్రారంభమయింది. కాల క్రమం లో దాని పరిమాణం పెరుగుతూ ఉండటం తో చూసేవారికి వింతగా ఉండేది. దీంతో శ్యాం లాల్ తనే ఆ కొమ్ము లాంటి గుబ్బను కత్తిరించుకునేవాడు.

అది ఎన్ని సార్లు కత్తిరించుకున్నా మళ్లీ పెరుగుతూనే ఉంది. కొందరు డాక్టర్లను సంప్రదించినా వారూ ఎమీ చేయలేకపోయారు. చివరికి దాన్ని శాశ్వతం గా తొలగించుకోవాలని తలచిన శ్యాం లాల్ యాదవ్ ఒక పెద్ద ఆస్పత్రి కి వెళ్లాడు.

డాక్టర్లు పరీక్షించి వైద్య శాస్త్రం లో ఇతడి సమస్యని ‘సెబసియస్ హార్న్ ‘ అని పిలుస్తారని, వ్యవహార భాషలో దెయ్యం కొమ్ము అంటారని చెప్పారు. అయితే ఈ కొమ్ము లాంటి భాగం సాధారణం గా సూర్య రశ్మి సోకే శరీర భాగం పైనే పెరుగుతుందని అన్నారు.

ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ మాట్లాడుతూ… ముందుగా ఎక్స్ రే తీసి చూస్తే ఈ గుబ్బ మూలాలు మరీ లోతుగా లేవని తేలింది. దీంతో అపరేషన్ చేసి దాన్ని పూర్తిగా తొలగించామని ఆయన అన్నారు. ఈ కేసు అరుదైనది కాబట్టి దీని వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ సైన్స్ లో ప్రచురణార్థం పంపిస్తామని చెప్పారు.

First Published:  14 Sep 2019 10:46 AM GMT
Next Story