Telugu Global
Others

పాక్షిక దృష్టికి పరిమితమైన ఏకీకరణ

తమ ప్రభుత్వం సక్రమమైంది అని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తమది “సచేతన”, “పటిష్ఠ”, “ఏకీకృత” ప్రభుత్వం అని చెప్పుకుంటోంది. వాడుతున్న ఈ రకమైన భాషనుబట్టి కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి అయితే మరో అడుగు ముందుకు వేసి “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం” అన్నారు. ఈ భాష నిరపాయకరమైందిగా కనిపించవచ్చు. అంటే తమ ప్రభుత్వంతో సహా అందరూ రాజ్యాంగానికి నిబద్ధులై ఉండాలని ఈ ప్రభుత్వం చెప్పదలచుకుంది. అలాగే తమ […]

పాక్షిక దృష్టికి పరిమితమైన ఏకీకరణ
X

తమ ప్రభుత్వం సక్రమమైంది అని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తమది “సచేతన”, “పటిష్ఠ”, “ఏకీకృత” ప్రభుత్వం అని చెప్పుకుంటోంది. వాడుతున్న ఈ రకమైన భాషనుబట్టి కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం అవుతోంది.

ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి అయితే మరో అడుగు ముందుకు వేసి “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం” అన్నారు. ఈ భాష నిరపాయకరమైందిగా కనిపించవచ్చు. అంటే తమ ప్రభుత్వంతో సహా అందరూ రాజ్యాంగానికి నిబద్ధులై ఉండాలని ఈ ప్రభుత్వం చెప్పదలచుకుంది.

అలాగే తమ ప్రభుత్వం స్వేచ్ఛ, సమానత్వం, మానవ గౌరవం మొదలైన రాజ్యాంగ మౌలిక లక్షణాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం నైతికంగా పురోగమించాలంటే దీనికి కట్టుబడి ఉండాలని చెప్తోంది. అంటే రాజ్యాంగ విలువలకు అడ్డు తగిలే పరస్పర అనుమానాలు, విద్వేషం, వ్యతిరేకత మొదలైనవి సాకారం చేసి ఏకీకృతం కావాలంటే ఈ విలువలకు కట్టుబడి ఉండాలన్నది ఈ ప్రభుత్వ అభిలాష.

సంక్లిష్టమైన ఏకీకరణకు సంబంధించిన అంశాలను లోతుగా పరిశీలంచకపోవడం, లేదా ఆ పని ఇష్టం లేకపోవడం లోనే ప్రభుత్వ పరిమితులు ఆధారపడి ఉంటాయి. అందువల్లే ఏకపక్షమైన ఏకీకరణలోని డొల్ల తనం బయటపడుతుంది. సామాజిక వాస్తవికతను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది కనక ఈ అంశాల లోతుల్లోకి వెళ్లదు. ఒక వేళ లోతుల్లోకి వెళ్తే కొన్ని వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా మినహాయిస్తున్నారన్న వాస్తవం బయట పడ్తుంది. ఇలా వివిధ వర్గాలను దూరం పెడ్తేనే తామ దృష్టితో ఏకీకరణ సాధ్యం అవుతుంది.

ఇలా కొంతమందిని మినహాయించడం ఏకీకరణను ప్రశ్నార్థకం చేస్తుంది. కొన్ని వర్గాలను మినహాయిస్తున్నందువల్లే ఏకీకరణ గురించి మాట్లాడవలసి వస్తుంది. ఏకీకరణ గురించి మాట్లాడడం అంతర్గత సామాజిక పరిస్థితుల గురించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కాదు. “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం” అన్న సూత్రం ప్రకారం ఏకీకరణ జరగాలి అంటే రాజ్యాంగంలోని వివిధ అధికరణాలకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. ఈ అధికరణాల ప్రకారం సామాజిక అంతరాలను తొలగించాలి. అప్పుడే ఏకీకరణ సాధ్యం అవుతుంది. అందువల్ల రాజ్యాంగ తత్వాన్ని అమలు చేయాలి, అమానుషమైన అంటరానితనంవంటి సామాజిక అంతరాలను నిర్మూలించాలి.

రాజ్యాంగ సూత్రాలను అమలు చేయాలి అంటే పౌరులను అందుకు సిద్ధం చేయాలి. అప్పుడే వారికి వారు విద్వేష రహితంగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. “ఎందుకూ కొరగారు” అనుకుంటున్న వర్గాల విషయంలో హింసకు పాల్పడకుండా ఉంటారు. ఏకీకరణ జరగాలంటే పౌరులు నిర్వర్తించవలసిన కనీస కర్తవ్యం ఇది. ఇతరులనూ మనుషులుగా భావించాలి. అంటే పరస్పరం తమకు నచ్చని వారు ఎందుకూ కొరగారని, శత్రుభావంతో మెలగకుండా ఉండడం సాధ్యం అవుతుంది.

అయితే ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకునే కొందరు ఏకీకరణను ఒక పార్శ్వం నుంచే చూస్తున్నారు. నిజానికి కొందరి చర్యలు ప్రభుత్వం కూడా ఏకపక్షమైన ఏకీకరణ విధానాలే అనుసరిస్తోందనడానికి నిదర్శనం. ఏకపక్షమైన దృష్టిగల వారు “మేము, వాళ్లు” అన్న రీతిలో మాట్లాడతారు. వాళ్లు అని తాము అనుకునే వారిని సామాజికంగా వెలివేస్తారు. గోహత్య లాంటి కారణాలు చూపి మూక దాడులకు పాల్పడి “వాళ్లను” అంతమొందిస్తారు. కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తారు. ఇలా ఏకపక్ష ధోరణిని సమర్థించే వారు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతారు. విద్వేషం వెళ్లగక్కుతారు.

విద్వేష భావం కేవలం సామాజిక వైరుధ్యాలవల్లే తలెత్తదు. లేదా ఉపాధికోసం పోటీవల్లో తలెత్తదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అది అసలే సాధ్యం కాదు. ఇప్పుడు మైనారిటీ వర్గాల వారు మెజారిటీ వర్గంతో పోటీ పడే స్థితిలో లేరు. అయినా ఈ రెండు వర్గాల మధ్యన సంబంధాలు సవ్యంగా లేవు. “పటిష్ఠమైన” భారత్ అన్న భావనతోనే ఈ సంబంధాలు బెడిసిపోయాయి.

వ్యక్తిగత ప్రయోజనాలు, జాతీయ ప్రయొజనాల స్థానాన్ని పాక్షిక దృష్టితో చూడడంవల్లే వైరుధ్యాలు, విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆ రకంగా భారత్ దీర్ఘ కాలిక ప్రయోజనాలకు దూరం అవుతోంది. నిజానికి భారత్ సహనం, మంచి మనుషులకు ఆలవాలమైన దేశం.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  11 Sep 2019 8:20 PM GMT
Next Story