Telugu Global
Cinema & Entertainment

తాప్సి ప్రేమలో పడింది

ప్రేమలో పడడం, నచ్చితే సహజీవనం చేయడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పడం హీరోయిన్లకు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న శృతిహాసన్, తన బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసింది. నిన్నటికినిన్న ఇలియానా కూడా తన బాయ్ ఫ్రెండ్ కు బై చెప్పేసింది. తాప్సి ఇంకా ఈ స్టేజ్ కు రాలేదు కానీ, తన లవ్ ఎఫైర్ ను మాత్రం బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించుకుంది. […]

తాప్సి ప్రేమలో పడింది
X

ప్రేమలో పడడం, నచ్చితే సహజీవనం చేయడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పడం హీరోయిన్లకు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న శృతిహాసన్, తన బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసింది. నిన్నటికినిన్న ఇలియానా కూడా తన బాయ్ ఫ్రెండ్ కు బై చెప్పేసింది. తాప్సి ఇంకా ఈ స్టేజ్ కు రాలేదు కానీ, తన లవ్ ఎఫైర్ ను మాత్రం బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. మరీముఖ్యంగా అతడు క్రికెటర్ కూడా కాదని తేల్చిచెప్పింది. కొన్నాళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, ఆ రిలేషన్ షిప్ ఎటు దారితీస్తుందో తనకు తెలియదని అంటోంది.

పనిలోపనిగా పెళ్లిపై కూడా స్పందించింది తాప్సి. తనకు పిల్లలు కావాలని అనిపించినప్పుడు మాత్రమే పెళ్లాడతానని స్పష్టంచేసింది. అప్పటివరకు సోలో లైఫ్ నే ఎంజాయ్ చేస్తామని, బాయ్ ఫ్రెండ్ కు కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వనని చెబుతోంది. ముంబయికి చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త కొడుకుతో తాప్సి ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. తాప్సి తాజా ప్రకటనతో ఆ పుకార్లు నిజమని తేలాయి.

First Published:  11 Sep 2019 5:34 AM GMT
Next Story