Telugu Global
NEWS

ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు

ఒమాన్ తో 1-2తో పోరాడి ఓడిన భారత్  ఆసియా చాంపియన్ ఖతర్ ను నిలువరించిన భారత్ ఖతర్ వేదికగా జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ క్వాలిఫైయర్స్ గ్రూప్- ఇ లీగ్ పోటీలలో 103వ ర్యాంకర్ భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. భారత్, అప్ఘనిస్థాన్, ఖతర్, ఒమాన్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఓడిన భారత్…ఖతర్ తో ముగిసిన మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది. ఒమాన్ పై సునీల్ […]

ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు
X
  • ఒమాన్ తో 1-2తో పోరాడి ఓడిన భారత్
  • ఆసియా చాంపియన్ ఖతర్ ను నిలువరించిన భారత్

ఖతర్ వేదికగా జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ క్వాలిఫైయర్స్ గ్రూప్- ఇ లీగ్ పోటీలలో 103వ ర్యాంకర్ భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి.

భారత్, అప్ఘనిస్థాన్, ఖతర్, ఒమాన్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఓడిన భారత్…ఖతర్ తో ముగిసిన మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది.

ఒమాన్ పై సునీల్ చెత్రీ గోల్

ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత ప్రారంభమ్యాచ్ లో పవర్ ఫుల్ ఒమాన్ తో జరిగిన గ్రూప్ తొలిరౌండ్ పోటీలో భారత్ కు కెప్టెన్ సునీల్ చెత్రీ ఆట మొదటి భాగంలోనే మెరుపుగోల్ తో 1-0 ఆధిక్యం అందించాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో సునీల్ చెత్రికీ ఇది 72వ గోల్ కావడం విశేషం.

అయితే ..ఒమాన్ స్టార్ ప్లేయర్ అలావీ అల్ మందార్ వెంట వెంటనే రెండుగోల్స్ సాధించి తన జట్టుకు 2-1 గోల్స్ తో విజయం అందించాడు. 87వ ర్యాంకర్ ఒమాన్ కు గట్టిపోటీ ఇచ్చిన భారత్ విజయం మాత్రం సాధించలేకపోయింది.

ఖతర్ కు దీటుగా భారత్

ఆసియా చాంపియన్ ఖతర్ తో ముగిసిన గ్రూప్ రెండోరౌండ్ మ్యాచ్ ను భారత్ 0-0తో డ్రాగా ముగించగలిగింది. గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ సంధు అసాధారణ ప్రతిభతో పవర్ ఫుల్ ఖతర్ ను భారత్ నిలువరించగలిగింది.

ఆట మొదటి భాగంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా… రెండో భాగంలో ఖతర్ దూకుడు పెంచింది. పదేపదే భారత్ గోల్ పైకి దాడులు చేసింది.

అయితే… గోల్ కీపర్ సంధుతో పాటు ఉదాంత్ సింగ్, అనీరుధ్ థాపా చక్కగా రాణించారు. ఆదివారం జరిగే గ్రూప్ మూడో రౌండ్ పోటీలో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది.

First Published:  11 Sep 2019 5:40 AM GMT
Next Story