Telugu Global
International

ఉగ్రవాది మసూద్‌ను విడుదల చేసిన పాక్‌...

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజాద్‌ను పాక్‌ జైలు నుంచి విడుదల చేసింది. కశ్మీర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌పైకి ఉసిగొల్పే ఉద్దేశంతోనే మసూద్‌ను పాక్‌ ప్రభుత్వం జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు బలగాలను అప్రమత్తం చేశారు. పంజాబ్‌, రాజస్తాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులను ప్రయోగించబోతోందని.. […]

ఉగ్రవాది మసూద్‌ను విడుదల చేసిన పాక్‌...
X

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజాద్‌ను పాక్‌ జైలు నుంచి విడుదల చేసింది. కశ్మీర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌పైకి ఉసిగొల్పే ఉద్దేశంతోనే మసూద్‌ను పాక్‌ ప్రభుత్వం జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ నేపథ్యంలో సరిహద్దు బలగాలను అప్రమత్తం చేశారు. పంజాబ్‌, రాజస్తాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులను ప్రయోగించబోతోందని.. అందులో భాగంగానే మసూద్‌ను జైలు నుంచి విడుదల చేశారని అనుమానిస్తున్నారు.

అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో పాకిస్థాన్‌ గతంలో మసూద్‌ను అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. కానీ భారత్‌తో మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌ అతడిని రహస్యంగా విడుదల చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే నిజంగానే మసూద్‌ను పాక్‌ విడుదల చేసిందా?, అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సాహసం నిజంగానే చేసిందా? అన్న దానిపై మరింత సృష్టత రావాల్సి ఉంది.

First Published:  9 Sep 2019 12:24 AM GMT
Next Story