Telugu Global
Cinema & Entertainment

తెలంగాణ కుర్రాడిగా నాగచైతన్య

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పక్కా హైదరాబాదీ కుర్రాడిగా కనిపించాడు రామ్. ఇప్పుడు నాగచైతన్య కూడా తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. రామ్ లానే తను కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ డైలాగ్స్ చెప్పబోతున్నాడు. అవును.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు చైతూ. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు మొదలైంది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ విషయాన్ని […]

తెలంగాణ కుర్రాడిగా నాగచైతన్య
X

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పక్కా హైదరాబాదీ కుర్రాడిగా కనిపించాడు రామ్. ఇప్పుడు నాగచైతన్య కూడా తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. రామ్ లానే తను కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ డైలాగ్స్ చెప్పబోతున్నాడు.

అవును.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు చైతూ. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు మొదలైంది.

ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిగా కనిపించబోతున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ విషయాన్ని శేఖర్ కమ్ముల నిర్థారించాడు. తన సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్, అతడు చెప్పే తెలంగాణ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నాడు.

“విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాస ని నాగ చైతన్య బాగా ఇష్ట పడి నేర్చుకున్నాడు. నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది.”

ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోగా నటిస్తోంది. ఆమెది కూడా తెలంగాణ అమ్మాయి పాత్రే. కాకపోతే ఆమెకు తెలంగాణ యాస కొత్త కాదు. ఫిదా సినిమాలో నిజమైన తెలంగాణ అమ్మాయిలాగానే చాలా బాగా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. 2-3 నెలల్లో టోటల్ సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  9 Sep 2019 5:05 AM GMT
Next Story