Telugu Global
NEWS

గుత్తా ఓకే... క‌డియం స‌రే... ఈ మాజీ స్పీక‌ర్ సంగ‌తేంటి?

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. విప్‌ల ప‌ద‌వుల పందేరం ముగిసింది. ప‌ద‌వులు రాని వారికి బుజ్జగింపులు ముగిశాయి. సీనియ‌ర్ నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీలు కురిపించారు. మ‌రికొంద‌రికి పదవులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే గులాబీ ద‌ళంలో ఇంకా కొంద‌రు మాత్రం ఏదో తెలియ‌ని అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ప‌దవి ఖాయ‌మైంది. బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఛైర్మ‌న్ కాబోతున్నారు. కడియం శ్రీహ‌రి రాజ్య‌స‌భ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌ధుసూద‌నచారి, […]

గుత్తా ఓకే... క‌డియం స‌రే... ఈ మాజీ స్పీక‌ర్ సంగ‌తేంటి?
X

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. విప్‌ల ప‌ద‌వుల పందేరం ముగిసింది. ప‌ద‌వులు రాని వారికి బుజ్జగింపులు ముగిశాయి. సీనియ‌ర్ నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీలు కురిపించారు. మ‌రికొంద‌రికి పదవులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే గులాబీ ద‌ళంలో ఇంకా కొంద‌రు మాత్రం ఏదో తెలియ‌ని అసంతృప్తిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ప‌దవి ఖాయ‌మైంది. బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఛైర్మ‌న్ కాబోతున్నారు. కడియం శ్రీహ‌రి రాజ్య‌స‌భ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌ధుసూద‌నచారి, జూప‌ల్లి కృష్ణారావుల‌కు త్వ‌ర‌లోనే ఉన్న‌త ప‌ద‌వులు ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.

దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే ఆలోచనలో సీఎం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తదితరులకు కూడా ఉన్నతమైన పదవులిస్తార‌ని స‌మాచారం. వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది.

అయితే ఈలిస్ట్‌లో మాజీ స్పీక‌ర్ సురేష్‌రెడ్డి పేరు మిస్ అయింది. ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరిన ఆయ‌న‌కు శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆయ‌న ఎమ్మెల్సీయే కాలేదు. రాజ్య‌స‌భ ఎంపీని చేస్తార‌ని ఆశించారు. కానీ అది నెర‌వేర‌లేదు.

నిజామాబాద్ ఎన్నిక‌ల్లో క‌విత ఓడిపోవ‌డంతో ఈయ‌న‌కు కష్టాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. ఆ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎవ‌రికీ ఏ ప‌ద‌వి ఇచ్చేంద‌కు సీఎం ఇష్టంగా లేర‌ని తెలుస్తోంది. అయితే డీఎస్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తే…అదే ప‌ద‌వి సురేష్ రెడ్డికి ఇస్తామ‌ని గులాబీ అధిష్టానం చెప్పింద‌ట‌.

మ‌రికొంత కాలం వెయిట్ చేసిన త‌ర్వాత సురేష్ రెడ్డి జంప్ కావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు బీజేపీలోకి వెళ‌దామ‌ని ఒత్తిడి తేస్తున్నార‌ట‌. అయితే ప‌ద‌వుల పందేరం ముగిసిన త‌ర్వాత… ఏ ప‌ద‌వి రాక‌పోతే క‌మ‌లం కండువా క‌ప్పుకోవాల‌నేది సురేష్‌రెడ్డి ప్లాన్‌గా తెలుస్తోంది.

First Published:  8 Sep 2019 8:39 PM GMT
Next Story