Telugu Global
NEWS

పార్టీ కార్యకర్తలైతే ఏంటి?- కేబినెట్‌ భేటీలో జగన్

ఏపీ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లిపోగా… మంత్రులతో జగన్‌ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపైన మంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది. సచివాలయ ఉద్యోగాలు పూర్తి ప్రతిభ ఆధారంగా కాకుండా మరోలా భర్తీ చేసి ఉంటే వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మంచి జరిగి ఉండేదని కొందరు మంత్రులు […]

పార్టీ కార్యకర్తలైతే ఏంటి?- కేబినెట్‌ భేటీలో జగన్
X

ఏపీ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లిపోగా… మంత్రులతో జగన్‌ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపైన మంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల భర్తీ అంశం ప్రస్తావనకు వచ్చింది.

సచివాలయ ఉద్యోగాలు పూర్తి ప్రతిభ ఆధారంగా కాకుండా మరోలా భర్తీ చేసి ఉంటే వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మంచి జరిగి ఉండేదని కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇందుకు సీఎం మాత్రం భిన్నంగా స్పందించారు. సచివాలయ ఉద్యోగాలు పూర్తి ప్రతిభ ఆధారంగా భర్తీ జరుగుతుంది… ఈ విషయంలో పైరవీలకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలైనంత మాత్రాన వారి కోసం రాంగ్ రూట్‌లో వెళ్లడం పద్దతి కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ వంద శాతం ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని…. కాబట్టి ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులకు గట్టిగానే చెప్పారు.

గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మైన్ల పోస్టుల భర్తీ అంశంపైనా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ లైన్‌మెన్ల పోస్టుల విషయంలోనైనా పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని మంత్రులు కోరగా… ఈ తరహా పోస్టుల్లో కూడా జోక్యం చేసుకోవద్దని మంత్రులకు సూచించారు. ఇప్పటికే కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మెన్లకు వెయిటేజ్ మార్కులు ఇచ్చి వారికి అవకాశాలు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. దాంతో స్పందించిన డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి… సదరు జూనియర్ లైన్‌మెన్లు అంతా టీడీపీ హయాంలో నియమితులైన టీడీపీ కార్యకర్తలని… ఇప్పుడు వారికే వెయిటేజ్‌ మార్కులు కూడా ఇస్తే ఇక టీడీపీ కార్యకర్తలే గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మెన్లుగా వస్తారని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

First Published:  5 Sep 2019 12:02 AM GMT
Next Story