Telugu Global
Cinema & Entertainment

వరల్డ్ వైడ్.... సాహో సంచలనం

విడుదలైన రోజే ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ ఫ్లాప్ అని తేల్చేశాయి. అయితేనేం ఈ యాక్షన్ థ్రిల్లర్ మాత్రం ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లలో ప్రపంచవ్యాప్తంగా ఓ మైలురాయిని అందుకోవడం విశేషం. తాజాగా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వరల్డ్ వైడ్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలకు పోటీగా ‘సాహో’ నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘సాహో’ […]

వరల్డ్ వైడ్.... సాహో సంచలనం
X

విడుదలైన రోజే ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ ఫ్లాప్ అని తేల్చేశాయి. అయితేనేం ఈ యాక్షన్ థ్రిల్లర్ మాత్రం ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లలో ప్రపంచవ్యాప్తంగా ఓ మైలురాయిని అందుకోవడం విశేషం.

తాజాగా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వరల్డ్ వైడ్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలకు పోటీగా ‘సాహో’ నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘సాహో’ రెండో స్థానంలో నిలవడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు మొదటి వారంలో చేసిన చిత్రం ‘హాబ్స్ అండ్ షా’ నిలిచిందిందట. దీని కలెక్షన్లు 45 మిలియన్ డాలర్లుగా ఉండడం విశేషం.

ఇక తాజాగా రిలీజ్ అయిన ‘సాహో’ చిత్రం 41 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక మూడో స్థానంలో పోయిన నెలలో విడుదలైన ‘ది లయన్ కింగ్’ చిత్రం ఉంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో 27 మిలియన్ డాలర్లను సంపాదించింది.

ఇక ‘ఒన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ ’ చిత్రం 25 మిలియన్ డాలర్ల వసూళ్లతో నాలుగో స్థానంలో ఉందట.

చివరగా ఐదోస్థానంలో ‘ఏంజల్ హేజ్ ఫాలెన్’ చిత్రం 24 మిలియన్ డాలర్లతో ఉంది.

దీన్ని బట్టి ‘సాహో’ చిత్రం ఫ్లాప్ అయినా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లలో రెండోస్థానంలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

First Published:  4 Sep 2019 2:31 AM GMT
Next Story