Telugu Global
NEWS

వైద్యులపై దాడి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసు.... డైరెక్ట్ జైలుకే !

ప్రాణాలను నిలబెట్టే దేవుడని డాక్టర్‌ని అంటుంటారు. కొన్ని సార్లు డాక్టర్ల తప్పో లేదా సరైన సమయానికి తీసుకొని రాకపోవడం వల్లో ఏదో ఒక కారణం చేత రోగి మరణించడమో.. ఆరోగ్యం క్షీణించడమో జరుగుతుంది. అలాంటి సమయంలో డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం.. కొన్ని సార్లు దాడులు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆసుపత్రులు ధ్వంసం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అని తేడా లేకుండా ఇలాంటి ఘటనలు ఈ మధ్య సాధారణమైనాయి. కాగా, […]

వైద్యులపై దాడి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసు.... డైరెక్ట్ జైలుకే !
X

ప్రాణాలను నిలబెట్టే దేవుడని డాక్టర్‌ని అంటుంటారు. కొన్ని సార్లు డాక్టర్ల తప్పో లేదా సరైన సమయానికి తీసుకొని రాకపోవడం వల్లో ఏదో ఒక కారణం చేత రోగి మరణించడమో.. ఆరోగ్యం క్షీణించడమో జరుగుతుంది. అలాంటి సమయంలో డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం.. కొన్ని సార్లు దాడులు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆసుపత్రులు ధ్వంసం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అని తేడా లేకుండా ఇలాంటి ఘటనలు ఈ మధ్య సాధారణమైనాయి.

కాగా, వీటికి చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజుల్లో ఒక చట్టాన్ని తీసుకొని వస్తోంది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రస్తుతం ఆన్‌లైన్లో పెట్టారు. ఈ బిల్లుకు సంబంధించిన అభిప్రాయాలు తెలపాలని ప్రజలను కోరింది. ఈ చట్టం ప్రకారం ఇకపై వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేస్తే కఠినంగా శిక్షలు ఉండబోతున్నాయి.

డాక్టర్, నర్సు‌పై దాడి చేస్తే కనీసం ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. తమపై దాడి జరిగిందని డాక్టర్ లేదా నర్సు ఒక్క కంప్లెంట్ రాసిస్తే చాలు సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా నిందితులను వెంటనే అరెస్టు చేస్తారు. డీఎస్పీ ర్యాంకు కలిగిన అధికారి ఈ కేసు విచారణ చేపడతారు. నిందితులు డాక్టర్లు, నర్సులను గాయపరిచినా, తీవ్రమైన హింసకు గురి చేసినా దాని తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదేళ శిక్ష పడుతుంది.

ఇక ఈ దాడిలో వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడి వైకల్యం ఏర్పడినా, కోలుకోలేని స్థితికి చేరినా లేదా చనిపోయినా పదేళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.

ఇక రోగుల బంధువులు చేసే దాడిలో ఆస్తి నష్టం సంభవిస్తే దాని మార్కెట్ విలువకు రెండింతలు వసూలు చేస్తారు. ఈ ముసాయిదా బిల్లుపై వచ్చే అభిప్రాయాలను క్రోఢీకరించి తిరిగి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

First Published:  3 Sep 2019 8:54 PM GMT
Next Story