Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్లో అతిపెద్ద సంచలనం

నాలుగోరౌండ్లోనే టాప్ సీడ్ ఒసాకా అవుట్  2019 టోర్నీలో ముగిసిన టాప్ సీడ్ల టైటిల్ వేట 2019 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్లోనే డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జోకోవిచ్, నవోమీ ఒసాకాల పోటీ ముగిసింది. ఈ ఇద్దరు టాప్ స్టార్లు టైటిల్ ను నిలుపుకోడంలో విఫలమయ్యారు. పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్లో వావరింకాతో జరిగిన మ్యాచ్ లో భుజం నొప్పితో ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ ఉపసంహరించుకొన్నాడు. మరోవైపు.. మహిళల సింగిల్స్ లో ప్రస్తుత […]

యూఎస్ ఓపెన్లో అతిపెద్ద సంచలనం
X
  • నాలుగోరౌండ్లోనే టాప్ సీడ్ ఒసాకా అవుట్
  • 2019 టోర్నీలో ముగిసిన టాప్ సీడ్ల టైటిల్ వేట

2019 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్లోనే డిఫెండింగ్ చాంపియన్లు నొవాక్ జోకోవిచ్, నవోమీ ఒసాకాల పోటీ ముగిసింది. ఈ ఇద్దరు టాప్ స్టార్లు టైటిల్ ను నిలుపుకోడంలో విఫలమయ్యారు.

పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్లో వావరింకాతో జరిగిన మ్యాచ్ లో భుజం నొప్పితో ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ ఉపసంహరించుకొన్నాడు.

మరోవైపు.. మహిళల సింగిల్స్ లో ప్రస్తుత చాంపియన్ నవోమీ ఒసాకాపై స్విస్ ప్లేయర్ బెలిండా బెంచిచ్ 7-5, 6-4తో సంచలన విజయం సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ హోరాహోరీ సమరంలో తొలిసెట్ ను 5-7తో చేజార్చుకొన్న ఒసాకా రెండోసెట్లో సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది.

ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ఒసాకా ప్రత్యర్థిగా ప్రస్తుత సీజన్లో బెలిండాకు ఇది వరుసగా మూడో గెలుపుకావడం విశేషం. సెమీస్ లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో డోనా వెకిచ్ తో బెలిండా అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  2 Sep 2019 10:15 PM GMT
Next Story