Telugu Global
Cinema & Entertainment

సాహో.. రెండో రోజుకి 200 కోట్లు

ఓవైపు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మరోవైపు సాహో వసూళ్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, 2 రోజుల్లో 200 కోట్ల మార్క్ అందుకుంది. శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో పాటు.. నార్త్ కు చేరాల్సిన మూవీ కంటెంట్ చేరడంతో.. రెండో రోజు కూడా వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సాహో సినిమా నాన్-బాహుబలి […]

సాహో.. రెండో రోజుకి 200 కోట్లు
X

ఓవైపు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మరోవైపు సాహో వసూళ్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, 2 రోజుల్లో 200 కోట్ల మార్క్ అందుకుంది. శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో పాటు.. నార్త్ కు చేరాల్సిన మూవీ కంటెంట్ చేరడంతో.. రెండో రోజు కూడా వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సాహో సినిమా నాన్-బాహుబలి రికార్డులతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు మహేష్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు చాలామంది నాన్-బాహుబలి రికార్డులు సృష్టించారు. అవన్నీ తుడిచిపెట్టాడు ప్రభాస్. బాహుబలి-2 తర్వాత సాహో సినిమా మాత్రమే రికార్డుల్లో ఉంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 2 రోజుల్లో 46 కోట్ల 26 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నైజాం – రూ. 14.62 కోట్లు
సీడెడ్ – రూ. 6.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.21 కోట్లు
ఈస్ట్ – రూ. 4.98 కోట్లు
వెస్ట్ – రూ. .3.95 కోట్లు
గుంటూరు – రూ. 5.43 కోట్లు
నెల్లూరు – రూ. 2.89 కోట్లు
కృష్ణా – రూ. 3.13 కోట్లు

First Published:  1 Sep 2019 3:39 AM GMT
Next Story