Telugu Global
Cinema & Entertainment

అంధుడిగా మారబోతున్న నితిన్

రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ అయిన సినిమా అంధాదున్. హిందీలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. దీనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కానీ మన తెలుగు హీరోలు దృష్టిపెట్టలేకపోయారు. అలా భారీ కాంపిటిషన్ మధ్య ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. అంధాదున్ తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారు. మిత్రుడు ఠాగూర్ మధుతో […]

అంధుడిగా మారబోతున్న నితిన్
X

రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ అయిన సినిమా అంధాదున్. హిందీలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. దీనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కానీ మన తెలుగు హీరోలు దృష్టిపెట్టలేకపోయారు. అలా భారీ కాంపిటిషన్ మధ్య ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు.

అంధాదున్ తెలుగు రీమేక్ రైట్స్ ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారు. మిత్రుడు ఠాగూర్ మధుతో కలిసి భారీ మొత్తానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది, దర్శకుడు ఎవరు, అసలు నితిన్ కాల్షీట్లు ఉన్నాయా లేదా అనేది వేరే విషయం.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు ఓకే చేశాడు నితిన్. వీటిలో 2 సెట్స్ పై ఉన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు నితిన్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఆ తర్వాత అంధాదున్ రీమేక్ గురించి ఆలోచిస్తాడు. అప్పటివరకు ఈ రీమేక్ పై సస్పెన్స్ తప్పదు. హీరో ఎవరనే సస్పెన్స్ మాత్రం లేదు.

First Published:  1 Sep 2019 3:15 AM GMT
Next Story