Telugu Global
Cinema & Entertainment

నాగార్జున స్థానంలో రమ్య కృష్ణ.... కారణం ఇదేనట!

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలతో…. మరొక వైపు బిగ్ బాస్ సీజన్ 3 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున స్పెయిన్ వెళ్లారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఐబీజా లో రిలాక్స్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ షూటింగ్ చేయడం ఆయనకు కుదరలేదు. దీంతో చేసేది లేక బిగ్ బాస్ మరొకరిని […]

నాగార్జున స్థానంలో రమ్య కృష్ణ.... కారణం ఇదేనట!
X

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలతో…. మరొక వైపు బిగ్ బాస్ సీజన్ 3 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్యనే తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున స్పెయిన్ వెళ్లారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఐబీజా లో రిలాక్స్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ షూటింగ్ చేయడం ఆయనకు కుదరలేదు. దీంతో చేసేది లేక బిగ్ బాస్ మరొకరిని హోస్ట్ గా రంగంలోకి దింపాల్సి వచ్చింది.

నాగార్జున స్థానంలో ఇప్పుడు రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చింది. ఆమె ఇంట్రడక్షన్ పార్ట్స్ ను శనివారం మధ్యాహ్నం కల్లా షూటింగ్ పూర్తి చేశారు బిగ్ బాస్ దర్శకనిర్మాతలు. నిన్న శనివారం కూడా రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చారు.

ఇవాళ అనగా ఆదివారం ఎపిసోడ్ లో కూడా రమ్యకృష్ణ హోస్ట్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈవారం మహేష్, పునర్నవి, హిమజా లు నామినేషన్స్ లో ఉన్నారు. కానీ నాగార్జున లేకపోవడం వలన ఈవారం ఎలిమినేషన్ జరగడం లేదని సమాచారం.

First Published:  1 Sep 2019 12:54 AM GMT
Next Story