Telugu Global
Cinema & Entertainment

టీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ ఏంటో!

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల కిందట టీజర్ రిలీజైంది. ఆ టీజర్ లో బన్నీ లుక్ ఎలా ఉండబోతోందో తెలిసిపోయింది. అంతేకాదు, టైటిల్ లుక్ కూడా అందులోనే ఉంది. ఇక కొత్తగా చెప్పడానికేం లేదు. కానీ ఈరోజు ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఖరీదైన కారు ముందు, చీప్ గా ఓ స్టూల్ పై మాస్ గా […]

టీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ ఏంటో!
X

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల కిందట టీజర్ రిలీజైంది. ఆ టీజర్ లో బన్నీ లుక్ ఎలా ఉండబోతోందో తెలిసిపోయింది. అంతేకాదు, టైటిల్ లుక్ కూడా అందులోనే ఉంది. ఇక కొత్తగా చెప్పడానికేం లేదు. కానీ ఈరోజు ఫస్ట్ లుక్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఖరీదైన కారు ముందు, చీప్ గా ఓ స్టూల్ పై మాస్ గా కూర్చొని చుట్ట వెలిగించే బన్నీ స్టిల్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో బన్నీ లుక్, టైటిల్ తెలిసిపోయినప్పటికీ.. ఈ స్టిల్ మాత్రం ఉన్నంతలో అందర్నీ ఆకర్షిస్తోంది. టీజర్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ, స్టిల్ ను మాత్రం అభిమానులు చూసి ఆనందిస్తున్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు మనం చూస్తున్న స్టిల్ కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదట. కేవలం వినాయక చవితి కానుకగా ఏదో ఒక స్టిల్ విడుదల చేయాలి కాబట్టి, బన్నీపై ప్రత్యేకంగా ఫొటోషూట్ చేసి మరీ ఈ డిజైన్ తయారుచేశారట. ఇప్పటికే బన్నీ సినిమాకు బడ్జెట్ పెరిగిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడిది ఎక్స్ ట్రా అన్నమాట.

First Published:  1 Sep 2019 3:36 AM GMT
Next Story