Telugu Global
National

కోటి 30లక్షలు తీసుకుని చీటింగ్‌... రేణుకా చౌదరిపై వారెంట్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ లంచం తీసుకున్న కేసులో ఆమెపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ తమ వద్ద కోటి. 30లక్షల రూపాయలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత రాంజీనాయక్ భార్య కళావతి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్‌ తన భర్తకు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని… టికెట్ ఇప్పించకపోగా.. డబ్బు కూడా వెనక్కు […]

కోటి 30లక్షలు తీసుకుని చీటింగ్‌... రేణుకా చౌదరిపై వారెంట్
X

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ లంచం తీసుకున్న కేసులో ఆమెపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ తమ వద్ద కోటి. 30లక్షల రూపాయలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేత రాంజీనాయక్ భార్య కళావతి ఆరోపించారు.

ఎమ్మెల్యే టికెట్‌ తన భర్తకు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని… టికెట్ ఇప్పించకపోగా.. డబ్బు కూడా వెనక్కు ఇవ్వకుండా మోసం చేసిందంటూ ఆమె రేణుకా చౌదరిపై అప్పట్లో చీటింగ్ కేసు పెట్టారు.

కోర్టు నుంచి నోటీసులు వచ్చినా రేణుకాచౌదరి వాటిని తీసుకోలేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రెండవ ఫస్ట్‌ క్లాస్ మెజిస్ట్రేట్ నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

First Published:  30 Aug 2019 4:23 AM GMT
Next Story