Telugu Global
Cinema & Entertainment

అఖిల్ తో.... నివేద థామస్

అక్కినేని అఖిల్…. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో ఒక్క హిట్టు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో…. తన ఆశలన్నీ బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అక్కినేని అఖిల్ ‘అ!’ మరియు ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే […]

అఖిల్ తో.... నివేద థామస్
X

అక్కినేని అఖిల్…. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో ఒక్క హిట్టు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో…. తన ఆశలన్నీ బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత అక్కినేని అఖిల్ ‘అ!’ మరియు ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పటికే పలు పేర్లు బయటకు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రమే ఇంకా వెలువడలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నివేదాథామస్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మధ్యనే ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నివేద… మొట్టమొదటి సారిగా అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతోంది.

ఈ సినిమా ఒక త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

First Published:  30 Aug 2019 12:37 AM GMT
Next Story