Telugu Global
NEWS

ఇసుక కొరతకు బాబు, లోకేష్ కొత్త కుట్ర

ఏపీలో ఐదేళ్ల పాటు జడలు విప్పి నాట్యం చేసిన ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తెస్తోంది. ప్రభుత్వమే ఇసుక డంపింగ్ యార్డులను నిర్వహించి అక్కడి నుంచి తక్కువ ధరకే వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఆలోచనకు గండికొట్టేందుకు టీడీపీ పెద్దలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇసుక రీచ్‌ నుంచి డంపింగ్‌ యార్డుకు ఇసుకను సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించగా అక్కడే చంద్రబాబు, నారా లోకేష్ చక్రం తిప్పారు. […]

ఇసుక కొరతకు బాబు, లోకేష్ కొత్త కుట్ర
X

ఏపీలో ఐదేళ్ల పాటు జడలు విప్పి నాట్యం చేసిన ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తెస్తోంది. ప్రభుత్వమే ఇసుక డంపింగ్ యార్డులను నిర్వహించి అక్కడి నుంచి తక్కువ ధరకే వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేందుకు సిద్ధమైంది.

అయితే ఈ ఆలోచనకు గండికొట్టేందుకు టీడీపీ పెద్దలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇసుక రీచ్‌ నుంచి డంపింగ్‌ యార్డుకు ఇసుకను సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించగా అక్కడే చంద్రబాబు, నారా లోకేష్ చక్రం తిప్పారు.

కృత్తిమ ఇసుక కొరతను సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయించేందుకు తక్కువ ధరకే తమ అనుచరుల చేత టెండర్లు వేయించారు. టన్ను ఇసుకను రీచ్‌ నుంచి తవ్వి డంపింగ్ యార్డుకు తరలించాలంటే కనీసం 100 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు భావించారు.

అయితే కొందరు కాంట్రాక్టర్లు రూ.15 నుంచి 50రూపాయలకు లోపే తాము ఇసుక సరఫరా చేస్తామంటూ తక్కువ ధరకే టెండర్లు వేశారు. ఇదేలా సాధ్యం అన్న అనుమానంతో ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది.

రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు… అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇలా అతి తక్కువ ధరకు టెండర్లు వేసిన వారంతా టీడీపీ నేతలని, వారిలో కొందరు దేవినేని ఉమా అనుచరులు కాగా… మరికొందరు నేరుగా చంద్రబాబుతో, నారా లోకేష్‌తో సంబంధాలున్నవారు.

తక్కువ ధరకే టెండర్లు వేయడం ద్వారా ఇసుక తరలింపు బాధ్యతను చేజిక్కించుకుని… ఆ తర్వాత ఆ ధరకు ఇసుక సరఫరా చేయడం సాధ్యం కాదంటూ మొండికేయడం ద్వారా ఇసుక కొరతను సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్నది వీరి ఉద్దేశం.

వీలైతే ఇసుక రీచ్‌ల్లోకి ఎంట్రీని సాధించి తమకు తెలిసిన పాత విధానంలో అక్రమంగా ఇసుక వ్యాపారం చేయడం అన్నది వీరి ఉద్దేశాలుగా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఇలాంటి ఎత్తులను టీడీపీ ఎక్కువగా వేసింది. కృష్ణా జిల్లాలో గొట్టిపాటి శ్రీధర్ అనే దేవినేని ఉమా అనుచరుడు 36 రూపాయలకే ఇసుక సరఫరా చేస్తానంటూ టెండర్లు వేశారు. అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత యలమంచిలి వెంకట కృష్ణమోహన్ 29 రూపాయలకే ఇసుక సరఫరా చేస్తానంటూ టెండర్లు వేశారు. ఈయనకు నారా లోకేష్‌తో నేరుగా సంబంధాలున్నాయి.

First Published:  29 Aug 2019 9:04 PM GMT
Next Story