Telugu Global
NEWS

పెరుగన్నం తింటూ చెప్పిన సంగతులు మరిచావా పవన్‌ కల్యాణ్....

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అందినప్పుడు ఒకలా… అందనప్పుడు మరోలా మాట్లాడడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందంటూ, అవినీతి జరుగుతోందంటూ గతంలో బేతపూడిలో పవన్ కల్యాణ్ ఆందోళన చేశారని… ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదకే రాజధాని ప్రాంతం మునిగిపోయిందని… పై నుంచి వచ్చే వరదకు స్థానికంగా వర్షాలు కూడా […]

పెరుగన్నం తింటూ చెప్పిన సంగతులు మరిచావా పవన్‌ కల్యాణ్....
X

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అందినప్పుడు ఒకలా… అందనప్పుడు మరోలా మాట్లాడడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు.

రాజధాని రైతులకు అన్యాయం జరిగిందంటూ, అవినీతి జరుగుతోందంటూ గతంలో బేతపూడిలో పవన్ కల్యాణ్ ఆందోళన చేశారని… ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదకే రాజధాని ప్రాంతం మునిగిపోయిందని… పై నుంచి వచ్చే వరదకు స్థానికంగా వర్షాలు కూడా తోడైతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందన్నారు. ఈ అంశాన్నే బొత్స సత్యనారాయణ చెబితే దాన్ని రాజకీయం చేయడం సరైన పద్దతి కాదన్నారు.

రాజధానిలో వాస్తవాలను వెలికి తీసేందుకు పర్యటనలు చేయాలే గానీ… చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉండకూడదన్నారు.

రాజధాని మహిళలు పెట్టిన పెరుగన్నం తింటూ… రాజధాని గ్రామంలో భూసేకరణ జరిపితే ఆమరణ దీక్ష చేస్తానని పవన్‌ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. కానీ పవన్ కల్యాణ్ పర్యటన చేసి వెళ్లిన తర్వాత నాలుగుసార్లు చంద్రబాబు రాజధాని గ్రామాల్లో భూసేకరణ చేశారని… మరి ఎందుకు అప్పుడొచ్చి చంద్రబాబును నిలదీయలేదని ఆర్కే ప్రశ్నించారు.

మంగళగిరిలో లోకేష్‌ను గెలిపించేందుకు పవన్‌ కల్యాణ్ కూడా ప్రయత్నించారని… కానీ అది సాధ్యం కాలేదన్నారు. లోకేష్ గెలవాలన్న ఉద్దేశంతోనే మంగళగిరిలో పోటీ చేసిన కమ్యూనిస్ట్ అభ్యర్థి తరపున ప్రచారానికి కూడా పవన్‌ కల్యాణ్ రాలేదన్నారు.

First Published:  30 Aug 2019 3:25 AM GMT
Next Story